తెలంగాణ

అవసరానికి మించి రాష్ట్రానికి నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి అవసరానికి మించి కేంద్రం నిధులను మంజూరు చేసిందని, అనేక ప్రాజెక్టులకు స్వల్ప వ్యవధిలోనే అనుమతులు ఇచ్చిందని, నీటిప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను ఇచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నిధుల కంటే ఎక్కువ నిధులనే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందని, ఈ విషయంలో చర్చకు తాము సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాడు ఆయన హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు. నిజాంపేట, దుండిగల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగారం, బోడుప్పల్, ఫీర్జాదిగూడ ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం అంటే కేంద్రానికి ప్రత్యేక మక్కువ ఉందని, ప్రతి సందర్భంలోనూ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తోందని
అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనేక హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేకపోయిందని, కేంద్రం ఇచ్చిన నిధులను వెచ్చించలేకపోయిందని, పథకాలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. కేంద్రం నిధులు మంజూరు చేసినా వాటికి రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వలేదని, దాంతో నిధులు మురిగిపోయే ప్రమాదం కూడా ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలోని పట్టణాలు అభివృద్ధికి శ్రద్ధ వహించలేదని, పారిశుద్ధం కొరవడి రాష్ట్రంలో రోగాలు ప్రబలాయని చెప్పారు.

'చిత్రం... కొంపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి