తెలంగాణ

పెరగనున్న విద్యుత్ చార్జీలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచకతప్పదని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు ట్రాన్స్‌కో, జెన్‌కో సూచించాయి. అయితే ఎప్పటి నుంచి పెంచాలన్నది మాత్రం కమిషన్‌కు స్పష్టంగా చెప్పలేదు. బహుశా ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీ లు పెంచే అవకాశాలు ఉన్నాయని సంబంధి త అధికార వర్గాలు చెబుతున్నాయి. విద్యుత్ చార్జీల కేటగిరీల్లో ఉన్న 8 విభాగాల్లో ఏఏ విభాగానికి ఎంత విద్యుత్ చార్జీలను పెంచాలన్న ప్రతిపాదనపై ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు తర్జనభర్జన చేస్తున్నారు. చార్జీలు పెం చుతూనే విద్యుత్ వినియోగదారుల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రతలు తీసుకోవాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. శనివారం విద్యుత్ సౌధలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్, ట్రాన్స్‌కో, జెన్‌కోకు చెందిన సీఎండీలు భేటీ అయ్యారు. తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల పనుల పురోగతిపై పరస్పర ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి
విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ శ్రీరంగారావుతో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు విద్యుత్ ప్రగతిపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఇరువురు సీఎండీల భేటీకి ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి విద్యుత్ అవసరం ఏ మేరకు అవసరమో వారి మధ్య చర్చలు జరిగాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలకు దాదాపు 2,500 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి చేపట్టాల్సిన పనులపై వారు సమీక్షించారు. ఏప్రిల్ నుంచి 2,000 వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి ఒప్పందాలు జరిగాయి. విద్యుత్ యూనిట్‌కు రూ. 3.50 పైసలు చెల్లించాలని ట్రాన్స్‌కో, జెన్‌కో నిర్ణయించింది. కొనుగోలు చేయనున్న విద్యుత్‌ను ఎన్‌టీపీసీ నుంచి తీసుకుంటున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న విద్యుత్ వాటాను మరింత పెంచడానికి కేంద్రానికి లేఖ రాయాలని సమావేశంలో సూచించారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్ సరఫరాకు త్వరితగతిన పనులు పూర్తిచేయాలని సమీక్షలో చర్చకు వచ్చింది. సమావేశంలో దక్షిణ విద్యుత్ సరఫరా మండలి సీఎండీ రఘుమారెడ్డి, ఉత్తర తెలంగాణ విద్యుత్ సరఫరా మండలి సీఎండీ గోపాల్‌రావు, మెంబర్ సెక్రటరీలు మనోహరరాజు (టెక్నికల్) కృష్ణయ్య (ఫైనాన్స్) సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
'చిత్రం... విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ శ్రీరంగారావుతో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, దక్షిణ విద్యుత్ సరఫరా మండలి సీఎండీ రఘుమారెడ్డి