తెలంగాణ

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పనితీరు భేష్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసులు చేస్తున్న కృషి బేష్ అని హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పలు కేసులు త్వరితగతిన పరిష్కరిస్తున్నారని చెప్పారు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచారన్నారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి స్టేడియంలో శనివారం జరిగిన కార్యక్రమానికి హోం మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి హ్యాకథాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 36 గంటలు సాగే ఈ కార్యక్రమంలొ టెక్నాలజీకి సంబంధించిన సరికొత్త సాఫ్ట్‌వేర్లు, యాప్స్ రూపొందించనున్నారు. సైబర్ నేరాలు పేరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీని వినియోగించుకోవాలనే వినూత్న ఆలోచనతో పోలీసు శాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సైబర్ నేరాల నియంత్రణకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే ఐటీ విద్యార్థులతో హ్యాక్‌థాన్ నిర్వహించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ హ్యాకథాన్‌లో భాగంగా ఐటీ, ఇంజినీరింగ్ విద్యార్థులతో కూడిన టీమ్స్, సైబర్ నేరాలను అరికట్టడానికి ఉపకరించే సరికొత్త సాఫ్ట్‌వేర్స్ రూపొందించనున్నాయి. దాదాపు 150 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, అదనపు కమిషనర్ షీకా గోయాల్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
'చిత్రం...హ్యాకథాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగిస్తున్న హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ