తెలంగాణ

పిల్లలకు గవర్నర్ చుక్కల మందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: రాజభవన్ ఉద్యోగుల నివాస ప్రాంగణంలో పిల్లలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పల్స్‌పోలియో విజయవంతంగా ముగిసింది. వైద్య ఆరోగ్య శాఖ పల్స్‌పోలియో అమలుకోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. అన్ని
జిల్లాల్లోని పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో 0-5 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. దవాఖానాలతో పాటు, ప్రధాన కూడళ్లు, బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లో పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రం మొత్తంలో 0-5 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేశారు. రాష్ట్రంలో దాదాపు 36 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్టు ప్రాథమిక సమాచారం వల్ల తెలిసింది. మారుమూల ప్రాంతాలకు కూడా వ్యాక్సిన్ డోస్‌లను సరఫరా చేశారు. మొత్తం 23,331 కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం అమలు చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో సహా వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. కాగా, సోమ, మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఆదివారం పోలియో చుక్కలు వేయని పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారు. 46 వేల బృందాలు రెండు రోజుల పాటు ఇంటింటికీ తిరిగి పరిశీలన చేస్తారు.