తెలంగాణ

ప్రజలంతా మావైపే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజలను చైతన్యపరచాలని, పోలింగ్ రోజు ఓటు వేసేందుకు అవగాహన కల్పించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త కనీసం పది మందికి తక్కువ కాకుండా ఓటర్లకు రాష్ట్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చైతన్య పరిచి కాంగ్రెస్‌కు ఓట్లు వేసే విధంగా చూడాలని ఆయన కోరారు. మున్సిపాలిటీల పరిధిలో ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఆదివారం ఇక్కడ ఫేస్‌బుక్ ద్వారా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. మైనారిటీ సోదరులు టీఆర్‌ఎస్, మజ్లిస్, బీజేపీ ఉచ్చులో పడకుండా చూడాలన్నారు. ఈ మూడు పార్టీలు పరస్పరం లోపాయికారిగా ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకుంటున్నాయన్నారు. ఈ పార్టీల నాయకులు చెప్పే మాయమాటలను నమ్మవద్దన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ, లౌకిక పార్టీ, దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన పార్టీ అనే సంగతిని గుర్తు పెట్టుకోవాలన్నారు. బీజేపీయేతర పార్టీలు దేశమంతా పౌరసత్వ సవరణ చట్టంపై ధ్వజమెత్తితే, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం వౌనంగా ఉన్నారన్నారు. కేసీఆర్ కేవలం మైనారిటీ ఓట్ల కోసం మాత్రమే ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్ దోస్తీని ప్రజలు ఎండగట్టాలన్నారు. రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికలు, 370వ అధికరణ, ట్రిపుల్ తలాక్ బిల్లు తదితర అంశాల్లో కేసీఆర్ సర్కార్ బీజేపీకి బహిరంగంగా మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో ఆర్థిక సంక్షోభం నెలకొని ఉందన్నారు. కేంద్రం నిధులు ఇస్తుందో లేదో
తెలియడం లేదు. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల మధ్య ప్రజలు నలిగిపోతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి నిధులు తెస్తామన్నారు. మున్సిపాలిటీల్లో అధ్వాన్న పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మాదిగ సోదరులు 40 లక్షల మంది ఉన్నారని, కానీ ఈ వర్గానికి చెందిన ఒక్క నేతకు కూడా కేసీఆర్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ నీచ రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలన్నారు. నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. రైతు రుణమాఫీ ఏమైందన్నారు. మున్సిపాలిటీల్లో ప్రజారోగ్యం లేదని, ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు లేవని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పురపాలక సంఘాలను ప్రక్షాళన చేసి, వాటిని సరైన దారిలో పెట్టే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు.

'చిత్రం... ఫేస్‌బుక్ ద్వారా కార్యకర్తలతో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి