తెలంగాణ

మంత్రి మల్లారెడ్డిపై సుమోటోగా కేసు నమోదు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి టిక్కెట్ల కోసం కోట్లు వసూలు చేశారని, ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్ని విషయాలు తెలిసి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఎఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, అవినీతి నిరోధక శాఖ ఈ విషయమై ఏమి చేస్తోందని ప్రశ్నించారు. సుమోటోగా స్వీకరించాలని ఆయన కోరారు. చిన్న ఉద్యోగులు లంచాలు తీసుకుంటే జైలుకు పంపించే ఏసీబీ, మంత్రి మల్లారెడ్డి అవినీతి వాస్తవాలతో బహిర్గతమైనా కూడా పట్టించుకోవడమేంటన్నారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహారంపై పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అవినీతికి పాల్పడితే సొంత కుమారుడిని కూడా జైల్లో పెడతా అని కేసీఆర్ గతంలో చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహార శైలి తెలిసి కూడా కేసీఆర్ తెలియనట్లు నటించడాన్ని ప్రజలు క్షమించరన్నారు. ఎన్నికల కమిషన్ ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం కూడా అధికార పార్టీకి తొత్తుగా మారినట్లు కనపడుతోందన్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా బుట్టదాఖలు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యానికి గుండెకాయలాంటి ఎన్నికల సంఘం తన విధులు సక్రమంగా నిర్వహించాలని ఆయన కోరారు.
'చిత్రం... ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్