తెలంగాణ

27 లేదా 28న మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నిక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, వైస్-చైర్‌పర్సన్ల ఎన్నికలు ఈ నెల 27 లేదా 28న నిర్వహించే అవకాశం ఉంది. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, వైస్-చైర్‌పర్సన్ల ఎన్నికల కోసం ప్రభుత్వం రూల్స్ జారీ చేసింది. ఈనెల 22న పోలింగ్ జరుగుతుండగా, 25న కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ ప్రశాంతగా పూర్తయ్యేచోట అదే రోజు ఫలితాలు వెలువడతాయి. కౌంటింగ్ పూర్తన వెంటనే అత్యధిక ఓట్లు పోలైన అభ్యర్థికి రిటర్నింగ్ ఆఫీసర్ సర్ట్ఫికెట్ ఇస్తారు. ఈ కార్యక్రమం 25 రాత్రివరకు పూర్తవుతుందని భావిస్తున్నారు. మేయర్, చైర్‌పర్సన్ల ఎన్నికకు వెంటనే నోటీసు ఇస్తారు. మేయర్లు, చైర్‌పర్సన్‌ల
ఎన్నికకు నోటీస్ ఇచ్చి 24 గంటల సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానంలో జనవరి 27 లేదా 28 తేదీల్లో మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నికలు జరుగుతాయి. మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నికకు ఆ యా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని మొత్తం సభ్యుల్లో కనీసం 50 శాతం మందైనా హాజరు కావలసి ఉంటుంది. 50 శాతం మంది లేకపోతే కోరం లేదని ఈ ఎన్నికను మరో రోజుకు వాయిదా వేస్తారు.