తెలంగాణ

టీఆర్‌ఎస్‌కు ఓటుతో మారిన రాష్ట్ర దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 20: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పటి వరకు జలగల్లా పట్టి పీడించిన కాంగ్రెస్, టీడీపీల పీడను వదిలించుకున్న ప్రజలు ఓటు ద్వారా టీఆర్‌ఎస్‌ను ఆదరించి కేసీఆర్‌కు పట్టం కట్టడంతో గడిచిన ఆరేళ్లలో రాష్ట్రం దశను మార్చుకుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన సోమవారం సూర్యాపేట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్ నుండి కొత్త బస్టాండ్ వరకు భారీ రోడ్ షోను నిర్వహించారు. అనంతరం కొత్తబస్టాండ్ వద్ద జరిగిన సభలో మంత్రి ప్రసంగించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి లబ్ధి చేకూరిందని చివరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల్లో లబ్ధిదారుడిగా ఉన్నారన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొనగా నేడు అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచామన్నారు. ఆసరా పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులకు పెన్షన్‌లు ఇస్తూ వారు ఆత్మగౌరవంతో జీవించే పరిస్థితులు కల్పించామన్నారు. కుల మత భేదాలు లేకుండా పేదింటి ఆడపిల్లల వివాహాలకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు బంధు ద్వారా సాయం అందిస్తూ రైతు బీమా ద్వారా రైతు కుటుంబాలకు భరోసా కల్పించామన్నారు. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, మిషన్ భగీరథ లాంటి పథకాలతో సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలో కొత్త రికార్డులను నెలకొల్పిందన్నారు. కేసీఆర్ పాలనతో సంతృప్తి చెందిన జనం రెండోసారి ఆదరించి పట్టం కట్టారన్నారు. అభివృద్ధి, సంక్షేమాలలో రాష్ట్రం దూసుకుపోతుంటే ఓర్వలేని విపక్షాలు అసత్య ఆరోపణలతో పాటు నోటికొచ్చినట్టుగా బూతులు మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని దుస్థితి దాపురించిందన్నారు. సూర్యాపేటకు మూసీ మురికి నీటి నుండి విముక్తి కలిగించి ప్రతి రోజు స్వచ్ఛమైన నీటిని అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. జిల్లాకేంద్రంగా మార్చడంతో పాటు ప్రతిష్టాత్మకమైన మెడికల్ కళాశాలను మంజూరు చేయించామని, మోడల్ మార్కెట్, మినీట్యాంక్ బండ్ నిర్మాణాలతో పట్టణ రూపురేఖల మార్చామన్నారు. సుస్థిర అభివృద్ధి, శాంతియుత పాలన కోసం మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, సినీ దర్శకుడు నిమ్మల శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జడ్పీ వైస్ చైర్మన్ గోపగోని వెంకటనారాయణ, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్‌రెడ్డి, బండారు ధనుంజయగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
'చిత్రం...రోడ్‌షోలో ప్రసంగిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, హాజరైన జనం