తెలంగాణ

మే 2న ఎమ్సెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూలును ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి మంగళవారం విడుదల చేశారు. తెలంగాణ ఎమ్సెట్‌ను మే 2న నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. పరీక్ష నిర్వహణ బాధ్యతను హైదరాబాద్ జెఎన్‌టియుకు అప్పగించారు. ఇసెట్‌ను 2016 మే 12న నిర్వహిస్తారు. దీన్ని కూడా జెఎన్‌టియుహెచ్ నిర్వహిస్తుంది. ఎంబిఎ, ఎంసిఎల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్‌ను మే 19న నిర్వహించనున్నారు. ఈ పరీక్ష బాధ్యతను కాకతీయ యూనివర్శిటీకి అప్పగించారు. ఎడ్‌సెట్‌ను మే 27న ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహించనుంది. పిజిఇ సెట్‌ను మే 29న ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిస్తుంది. లాసెట్‌ను మే 24న కాకతీయ యూనివర్శిటీ నిర్వహిస్తుంది. పిజి లాసెట్‌ను మే 24న కాకతీయ యూనివర్శిటీ నిర్వహించనుంది. పిఇసెట్ నిర్వహణ బాధ్యతను ఉస్మానియా యూనివర్శిటీకే అప్పగించారు. మంగళవారం ప్రకటించిన 8 ప్రవేశపరీక్షలను జెఎన్‌టియు, ఉస్మానియా, కాకతీయ యూనివర్శిటీలకే అప్పగించారు. ఆయా యూనివర్శిటీల విసిలు చైర్మన్లుగానూ, అక్కడ పనిచేసే సంబంధిత విభాగాల సీనియర్ ప్రొఫెసర్లు కన్వీనర్లుగా వ్యవహరిస్తారు.
సీట్లు కాలేజీల వివరాలు
ఎమ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీంలో అర్హులైన వారికి తెలంగాణలో 266 కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సీట్లు 1,26,468 కాగా అందులో కన్వీనర్ కోటా సీట్లు 79,452, మేనేజిమెంట్ కోటా సీట్లు 46,926 ఉన్నాయి. ఇక ఎంఫార్మసీలో 130 కాలేజీలున్నాయి. అందులో 7820 సీట్లుండగా, కన్వీనర్ కోటాలో 5335, మేనేజిమెంట్ కింద 2485 ఉన్నాయి. లా కోర్సును ఆఫర్ చేసే కాలేజీలు 17 కాగా అందులో 2850 సీట్లున్నాయి. కన్వీనర్ కోటా 1995 కాగా మేనేజిమెంట్ కింద 850 సీట్లున్నాయి. ఐసెట్ ఎంబిఎ కాలేజీలు 341 కాగా, వాటిలో 41796 సీట్లున్నాయి. వాటిలో కన్వీనర్ కోటా కింద 38166 సీట్లు, మేనేజిమెంట్ కోటా కింద 3630 సీట్లున్నాయి. ఎంసిఎ కాలేజీలు 49 కాగా, వాటిలో 2966 సీట్లున్నాయి. కన్వీనర్ కోటా కింద 1976, మేనేజిమెంట్ కోటా కింద 990 సీట్లున్నాయి.
గత ఏడాది అర్హులైన విద్యార్ధులు
ఇంజనీరింగ్‌లో గత ఏడాది 95,556 మంది, మెడిసిన్ అగ్రికల్చర్ స్ట్రీంలో 72794 మంది, ఇసెట్‌లో 18143 మంది, ఐసెట్‌లో 58037 మంది, ఎడ్‌సెట్‌లో 57220 మంది, పిజి ఇసెట్‌లో 38882, లాసెట్ మూడేళ్ల కోర్సులో 9835 మంది, ఐదేళ్ల కోర్సులో 3035 మంది, ఎల్‌ఎల్‌ఎంలో 1471 మంది, పిఇ సెట్‌లో 6217 మంది ఎంపికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుండి ప్రధానంగా టెన్త్, ఇంటర్, ఎమ్సెట్‌ను మంచి రోజులు చూసి నిర్వహించడం ఆనవాయితీ అయితే ఈసారి తెలంగాణ రాష్ట్రం అన్ని ప్రవేశపరీక్షలనూ మంచి రోజులు చూసి నిర్ణయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచి రోజున పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్ధుల్లో సైతం ఆత్మవిశ్వాసం ఉంటుందని కొంత మంది అభిప్రాయపడుతుండగా, మరికొంత మంది ప్రభుత్వానికి మరీ సెంటిమెంట్లు పనికిరావని చెబుతున్నారు. ఎమ్సెట్‌ను దశమి నాడు, ఇసెట్‌ను షష్టినాడు, ఐసెట్‌ను త్రయోదశినాడు, పిజిఇ సెట్‌ను సప్తమి నాడు, లాసెట్‌ను తదితయ, పిఇసెట్‌ను పంచమి నాడు నిర్వహించనున్నారు.
క్వాలిటీపై రాజీపడేది లేదు: పాపిరెడ్డి
కాలేజీలు నిర్బంధంగా ప్రమాణాలు పాటించాల్సిందేనని, ఎలాంటి ఉదాశీన వైఖరికి తావు లేదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు. ప్రమాణాలు లేని కాలేజీల యాజమాన్యాలు తక్షణం సదుపాయాలతో పాటు ప్రమాణాలను పాటించేందుకు చర్యలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేశారు.