తెలంగాణ

నేడే పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం జరుగనుంది. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి. నాగిరెడ్డి మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో పోలింగ్ ఏర్పాట్ల గురించి మాట్లాడారు. నాగిరెడ్డితో పాటు కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్, జాయింట్ డైరెక్టర్ జయసింహారెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు ఉండ గా 120 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా బుధవారం తొమ్మిది కార్పొరేషన్లకు, ఈ నెల 24న ఒక కార్పొరేషన్ (కరీంనగర్)కు పోలిం గ్ నిర్వహిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్లలో ముగ్గురు కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లో 80 మంది కౌన్సిలర్లు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న మున్సిపాలిటీల్లోని 2,647 వార్డు స్థానాలకు 11,179
మంది, కార్పొరేషన్లలో 382 వార్డు స్థా నాలకు 1,747 మంది
రంగంలో మిగిలారు. మున్సిపాలిటీల్లో 40,36,346 మంది, కార్పొరేషన్లలో 13,13,909 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ నిర్వహణకు 45 వేల మంది, కౌంటింగ్‌కు 10 వేల మంది ఉద్యోగులు పనిచేస్తారు.
మున్సిపాలిటీల్లో 6,188 పోలింగ్ కేంద్రాలు, కార్పొరేషన్లలో 1,773 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కోసం మంగళవారమే సిబ్బం ది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి అవసరమైన పోలింగ్ మెటీరియల్ తీసుకుని వెళ్లారు. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది. 2,072 కేంద్రాల్లో వీడియో కవరేజ్, 2,406 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తుండగా, 2,053 కేంద్రాల్లో మైక్రో ఆబ్జర్వర్లను నియమించారు. 15 వేల మంది సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారు. 1,107 మంది ఆర్‌ఓలు అంతే సంఖ్యలో ఏఆర్‌ఓలు మున్సిపాలిటీల్లో, 152 మంది ఆర్‌ఓలు, 153 మంది ఏఆర్‌ఓలు కార్పొరేషన్ల పరిధిలో పనిచేస్తున్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనలకు సంబంధించి 110 ఫిర్యాదులు రాగా వీటిని పరిష్కరించారు. మున్సిపాలిటీల్లో 120 మంది వ్యయ పరిశీలకులు, కార్పొరేషన్లలో 20 మంది వ్యయ పరిశీలకులు పనిచేస్తున్నారు.
మున్సిపాలిటీల్లో 120 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను, కార్పొరేషన్లలో 10 కేంద్రాలను మంగళవారం ఏర్పాటు చేశారు. ఇవే కేంద్రాల్లో స్ట్రాంగ్ రూంల ను ఏర్పాటు చేసి, బుధవారం రాత్రి వరకు వచ్చే బ్యాలెట్ బాక్సులను భద్రపరుస్తారు. ఈ నెల 25న ఉదయం ఇవే కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుంది.