తెలంగాణ

50వేల మందితో మస్తు బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం జరుగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు 50 వేల మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. తెలంగాణ స్పెషల్ పోలీస్‌తో పాటు ఇతర ప్రత్యేక పోలీస్ దళాలను తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు. సమస్యాత్మక ప్రాంతాలు, ఎన్నికల సంఘం సూచించిన వ్యూహాత్మక ప్రాంతాల్లో నియమించారు. శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ జితేందర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయడం, రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను కచ్చితంగా పాటించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని యూని ట్ అధికారులను అప్రమత్తం చేశారు.
పోలీస్ శాఖతో పాటు ఎక్సైజ్, అటవీ తదితర శాఖల నుండి కూడా బలగాలను ఎన్నికల విధుల కోసం నియమించారు. రాష్ట్రంలో తీవ్రవాద, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లోని ఓటర్లలో మనోస్థైర్యం నింపేందుకు వివిధ కార్యక్రమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పోలింగ్ సామాగ్రితో ఆయా బూత్‌లకు వెళ్లే ఎన్నికల సిబ్బందిని సురక్షితంగా తీసుకెళ్లేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
అదేవిధంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కూడా తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, మున్సిపల్ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన 131 మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇదిలావుండగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 51.36 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రూ.21.22 లక్షల విలువైన మద్యాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కలిగించే విధంగా గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రజలను కోరారు.