తెలంగాణ

టీఆర్‌ఎస్ ప్రభంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 22: రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల పార్టీగా మారిన టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించి అసెంబ్లీ, పరిషత్ ఎన్నికల తరహాలోనే అన్ని మున్సిపల్ పీఠాలు కైవసం చేసుకోవడం ఖాయమని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. బుధవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని 44వ వార్డు నెహ్రూనగర్‌లో గల సిదార్థ పాఠశాల పోలింగ్‌కేంద్రంలో సతీమణి గుంటకండ్ల సునీతతో కలిసి మంత్రి ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ పరిపాలన ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్‌కు వచ్చిన ఓటర్ల ముఖాల్లో చిరునవ్వుల రూపంలో స్పష్టంగా కన్పించిందన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటువేస్తే అభివృద్ధి ఎలా జరుగుతుందో 2014 శాసనసభ ఎన్నికల నాటి నుండి చూస్తున్న ప్రజలు ఏ ఎన్నికలు వచ్చినా అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తున్న గులాబీపార్టీనే ఆదరిస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎవరికి ఓటువేస్తే తమ వార్డు, పట్టణాలను అభివృద్ధ్ది చేస్తారన్నది గుర్తించి ప్రజలు ఓట్లు వేశారని చెప్పారు. అభివృద్ధి నిరోధకులకు ఓట్లు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదనేది తెలుసుకొని 2014నుండి ఏ ఎన్నికలు వచ్చినా కేసీఆర్ పార్టీకే పట్టం కడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని గ్రామీణప్రాంతాల రూపురేఖలు మారిపోయాయని, అదే తరహాలో మున్సిపల్ ఎన్నికల తంతు ముగిసిన తర్వాత పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మున్సిపల్ పట్టణాన్నింటినీ అభివృద్ధి చేసేందుకు కార్యాచరణను సీఎం సిద్ధం చేసుకున్నట్టు తెలిపారు. సూర్యాపేటలోని అన్ని వార్డుల్లో విజయం సాధించడంతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో విజయకేతనం ఎగురవేసి మున్సిపల్ పీఠాలను అధిష్టిస్తామని జోస్యం చెప్పారు.
సూర్యాపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం