తెలంగాణ

ఆధునిక వ్యవసాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: ఆధునిక వ్యవసాయ పద్ధతులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వ్యవసాయ ఆధారిత రంగాలపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. హైదరాబాద్‌లో గురువారం నాబార్డు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర రుణ ప్రణాళిక సెమినార్‌లో మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు. వ్యవసాయ ఆధారిత రంగాలను బలోపేతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్, మార్కెటింగ్, ఎక్స్‌పోర్టు రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా నాబార్డ్డుకు మంత్రి సూచించారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 30 శాతం నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని, సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కావడంతో వారి కష్టాలు ఆయనకు బాగా తెలుసని అన్నారు. వ్యవసాయం చేసే రైతుకు ఒకప్పుడు గౌరవం ఉండేదని, గత ప్రభుత్వాల చిన్నచూపు ఇతర కారణాల వల్ల ప్రాధాన్యం కోల్పోయిందన్నారు. వ్యవసాయం చేయడం అంత సులువు కాదని, వర్షాలు, విత్తనాల ఎంపిక మొదలుకొని ఎరువులు, మార్కెటింగ్, గిట్టుబాటు ధర వరకు అన్నింటిపై రైతు పరిస్థితి ఆధారపడి ఉంటుందన్నారు. నాబార్డు అందించిన ఆర్థిక సహకారం వల్ల గోదాముల సామర్థ్యాన్ని
పెంచుకోగలిగామన్నారు. తాను మార్కెటింగ్ మంత్రిగా ఉన్న హయాంలో రూ. 1056 కోట్ల వ్యయంతో గోదాముల నిర్మాణం చేపట్టామని, అలాగే, మైక్రో ఇరిగేషన్‌కు నాబార్డ్ రూ. 874 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించగా చిన్ననీటి వనరులను పెంచుకోగలిగామన్నారు. దేశంలో మరే రాష్ట్రం కూడా వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించడం లేదన్నారు. రైతుబంధు పథకానికి ఏటా రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. అలాగే, రైతు ఏ కారణంగా అయినా చనిపోతే వారి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సౌకర్యం అందించడానికి రైతుబీమాను అమలు చేస్తున్నామని, దీనికోసం ఏటా రూ.1136 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రైతులకు పంట రుణ మాఫీ పథకానికి ఏటా ఆరు వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడంతో పాటు ఎత్తిపోతల పథకాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, కాళేశ్వరం, నెట్టంపాడు, బీమా ఎత్తిపోతల పథకాలతో పాటు ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ. 8 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని మంత్రి హరీశ్‌రావు వివరించారు. నీటిపారుదల ప్రాజెక్టులపై ఏటా రూ. 25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, బడ్జెట్‌లో రూ. 9 వేల కోట్లు కేటాయించి బ్యాంకుల నుంచి రూ. 25 వేల కోట్లు సేకరిస్తున్నామని అన్నారు. వ్యవసాయం దండుగ అనే స్థితి నుంచి వ్యవసాయం లాభసాటి అనే స్థాయికి తీసుకొచ్చామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే విత్తన భాండాగారంగా మారిందని, ప్రస్తుతం ఆఫ్రికా, ఆసియా దేశాలకు కూడా విత్తనాలను ఎగుమతి చేయగలిగే స్థాయికి చేరుకున్నామని అన్నారు. రాష్ట్రంలో భూ ప్రక్షాళన ద్వారా 96 శాతం రెవెన్యూ రికార్డులను సరి చేశామని, మిగిలిన 4 శాతం కోర్టు కేసుల వల్ల పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి వివరించారు. వ్యవసాయ ఆధారిత రంగాలైన గొర్రెల పెంపకం, చేపల పెంపకం ద్వారా లక్షలాది కుటుంబాలకు ప్రత్యేక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా నాబార్డు వ్యవసాయ ఆధారిత రంగాలకు చేయూత ఇవ్వాలని, ఫుడ్ ప్రాసెసింగ్, స్టోరేజి, మార్కెటింగ్, ఎక్స్‌పోర్టు రంగాలపై దృష్టి సారించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. నాబార్డ్ రుణ ప్రణాళిక సమావేశాలను జిల్లాల్లో రైతుల మధ్య నిర్వహించడం వల్ల వారి సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడుతాయని మంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు.

'చిత్రం...రాష్ట్ర రుణ ప్రణాళికపై జరిగిన నాబార్డు సెమినార్‌లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు