తెలంగాణ

ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: ఇంటర్మీడియట్ పరీక్షలను ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా పకడ్బందీగా నిర్వహించాలని, అందుకు అవసరమైన ముందస్తు చర్యలను తీసుకోవాలని విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా గురువారం నాడు సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు. విద్యార్ధులు ఎలాంటి అనుమానాలు లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 20వ తేదీ వరకూ ప్రయోగ పరీక్షలను, మార్చి 4వ తేదీ నుండి 23వ తేదీ వరకూ పబ్లిక్ పరీక్షలను నిర్వహిస్తున్నట్టు అధికారులు వివరించారు. ఇంటర్ పరీక్షలకు 9,65,840 మంది హాజరవుతున్నారని వీరి కోసం 1334 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఫీజుల కోసం విద్యార్థుల హాల్ టిక్కెట్లను ఇవ్వకుండా పలు కాలేజీల యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయనే ఫిర్యాదులపై మంత్రి స్పందిస్తూ, ప్రభుత్వమే నేరుగా హాల్‌టిక్కెట్లను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తోందని, వాటిని నెట్ నుండి డౌన్‌లోడ్ చేసుకుని వారు పరీక్షలకు హాజరుకావచ్చని చెప్పారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడికి సంబంధించి సాంకేతక సహకారాన్ని సీజీజీ నుండి తీసుకుంటున్నామని, సీజీజీ నిర్వహణ తీరును ఎప్పటికపుడు పరిశీలించేందుకు సాంకేతిక నిపుణులతో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. పరీక్షలను నిర్వహించే విషయంలో అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల సందేహాలను , ఫిర్యాదులను నివృత్తి చేసేందుకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటంతో పాటు బోర్డు కార్యాలయంలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం చేపట్టిన సాంకేతిక మార్పులపై జిల్లా ఇంటర్మీడియట్ అధికారులకు ఎప్పటికపుడు శిక్షణ ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో హైపవర్ కమిటీలు ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో పరీక్షలను విజయవంతం చేసేందుకు పోలీసు, ఆర్టీసీ, వైద్య , ఆరోగ్య శాఖ, రెవిన్యూ శాఖల అధికారులతో త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. పరీక్షల నిర్వహణలోనూ, మూల్యాంకనంలోనూ పర్యవేక్షణ పెంచాలని, ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా చూడాలని కోరారు. ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పరీక్షల నియంత్రణాధికారి అబ్దుల్ ఖాలిక్, సంయుక్త కార్యదర్శి వై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ పీఠిక చదివించాలి
పాఠశాలల్లో ప్రార్ధన సమయంలో రాజ్యాంగ పీఠికను చదివించాలని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ కోరింది. ఈ మేరకు సెంటర్ చైర్మన్ నాగటినారాయణ, కార్యదర్శి పగడాల లక్ష్మయ్యలు విద్యాశాఖ కార్యదర్శి జనార్ధనరెడ్డిని కోరారు. దేశంలో సామాజిక, ఆర్ధిక రాజకీయ పరిపాలనా విషయాల్లో అనేక అంశాలు, పరిణామాల నేపథ్యంలో భావి భారత పౌరులుగా ఎదుగుతున్న బడి పిల్లలకు విద్యార్థి దశ నుండే రాజ్యాంగంలోని వౌలిక లక్ష్యాలను మననం చేయించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
సీఓఈల్లో ప్రవేశాలు
రాష్టవ్య్రాప్తంగా గురుకులాలకు అనుబంధంగా ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కాలేజీ(సీఓఈ)ల్లో ప్రవేశాలకు జనవరి 5వ తేదీన నిర్వహించిన పరీక్షకు 67 వేల మంది హాజరుకాగా వారి నుండి రెండోదశ వడపోతకు 8400 మందిని ఎంపిక చేశామని కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. 28 సీఓఈల్లో 2800 సీట్లు మాత్రమే ఉన్నాయని, రెండోదశ వడపోత పరీక్షను ఫిబ్రవరి 9న నిర్వహిస్తామని ఆయన చెప్పారు.