తెలంగాణ

మజ్లిస్‌కు తప్ప ఎవ్వరికీ అనుమతి ఇవ్వరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: హైదరాబాద్ నగరంలో సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు కేవలం మజ్లిస్ పార్టీకే అనుమతి ఇస్తారా? అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కే.లక్ష్మణ్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈనెల 25వ తేదీన చార్మినార్ వద్ద మజ్లిస్ తలపెట్టిన ర్యాలీ, సభకు అనుమతి ఇవ్వోద్దని ఆయన డిమాండ్ చేశారు. డాక్టర్ లక్ష్మణ్‌తో కూడిన బీజేపీ ప్రతినిధుల బృందం గురువారం బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్‌లో కమిషనర్ అంజనీ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ.కిషన్‌రెడ్డికి పోలీసులు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని, నగరంలో బీజేపీ కార్యక్రమాలనుకు అనుమతి ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేవలం మజ్లిస్ కార్యక్రమాలకు మాత్రమే అనుమతిస్తున్నారని లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. మజ్లిస్ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నా పోలీసులు స్పందించడం లేదని విమర్శించారు.

'చిత్రం...హైదరాబాద్ సీపీని కలిసిన బీజేపీ బృందం