తెలంగాణ

ప్రొఫెసర్ కాశిం అరెస్టు కుట్రలో భాగమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: ప్రొఫెసర్ కాశిం అరెస్టు వెనుక కుట్ర ఉందని విద్యార్థి సంఘాలు ఉస్మానియా యూనివర్శిటీలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో పాలకులు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం ప్రతి వ్యక్తికీ భావవ్యక్తీకరణను ప్రసాదించిందని కానీ పౌర హక్కులకు దేశ వ్యాప్తంగా ప్రమాదం ఏర్పడుతోందని అన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూ డెముక్రసీ నేత రమ మాట్లాడుతూ రోజూ యూనివర్శిటీలో పాఠాలు బోధించే ప్రొఫెసర్‌ను పోలీసులు పరారిలో ఉన్నట్టు చూపించడమంటే వారి తీరు అర్ధం అవుతోందని అన్నారు. ప్రభుత్వం ఎంత తప్పుడు కేసు పెట్టిందో అర్ధమవుతోందని చెప్పారు. కాశింను నిరంతరం ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించడం వల్లనే ఆయనను అరెస్టు చేశారని, ఆయన ప్రశ్నలను అధికారపక్షం జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. కాశిం విషయంలోనే ఇలా జరగడం లేదని, దేశ వ్యాప్తంగా తమ హక్కులను గురించి అడిగినందుకు జేఎన్‌యూ, జామియా, అలిఘర్ తదితర యూనివర్శిటీలపై దమనకాండ కొనసాగుతోందని అన్నారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏలపై మాట్లాడితే మేథావులను, హక్కులను అణచివేసి వారిని అరెస్టు చేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఎమర్జన్సీని తలపిస్తోందని అన్నారు. విమల మాట్లాడుతూ ప్రజల గొంతుగా ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే ఓ అరుదైన మేధావిని ప్రభుత్వం కుట్ర పూరితంగా అరెస్టు చేసిందని విమర్శించారు. నిత్యం విద్యార్థుల మధ్య ఉంటూ పాఠాలు బోధించే ప్రొఫెసర్‌పై బురదజల్లడం సరికాదని అన్నారు. మీడియా కూడా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నాయని, కాశిం భార్యపైనా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. స్వయం ప్రతిపత్తి ఉండే యూనివర్శిటీలో పొలీసులు ఓయూ అధికారుల అనుమతి లేకుండా బలవంతంగా ఇంటి తలుపులు పగులగొట్టి పిల్లలనుభయపెట్టి, విద్యార్థులను అరెస్టు చేసి భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. ఓయూ లా కాలేజీ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రమాదంలో పొంచి ఉన్న ఈ సమయంలో ప్రొఫెసర్ కాశింను అరెస్టు చేశారని అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ రాజకీయ అభిప్రాయం ఉంటుందని, అభిప్రాయం ఉండటమే నేరం అన్నట్టు ప్రభుత్వం , పోలీసులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ కాశిం అరెస్టు రిమాండ్ కాపీ చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిందని అన్నారు. ఎవరో అనామకుడు చెప్పిన దానిని ఆధారంగా చేసుకుని ఒక ప్రొఫెసర్‌ను అరెస్టు చేయడం చూస్తుంటే పాలకులు రాజ్యాంగానికి కల్పించిన హక్కులను ఎలా తప్పుదారి పట్టిస్తున్నారో అర్ధమవుతోందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నేత పాపయ్య మాదిగ, డాక్టర్ అన్సారీ, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రొఫెసర్ పద్మజా షా, డాక్టర్ బాలస్వామి, డాక్టర్ సమున్నత, డాక్టర్ కొండ నాగేశ్వర్, డాక్టర్ నవీన్, డాక్టర్ ఆమంచి నాగేశ్వరరావు, డాక్టర్ అనురాధ, ప్రజా ఫ్రంట్ నాయకులు రవిచందర్, న్యూ డెముక్రసీ నేత గోవర్థన్, రామన్న మాదిగ, అభినవ్, బూరం , బాలమల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
'చిత్రం...రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి