తెలంగాణ

మా బాధ్యత మరింత పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు తమపై 360 డిగ్రీస్‌లో ఆదరణ చూపారని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్‌లో శనివారం స్పందిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణ ప్రాంత ప్రజలలో రకరకాల మనస్తత్వాల ఓటర్లు ఉంటారని, వారంతా
ఒకే రకమైన తీర్పు ఇచ్చిన ఉదంతం తన రాజకీయ అనుభవంలో ఎప్పుడూ లేదన్నారు. ఈ జిల్లా ఆ జిల్లా అని తేడా లేకుండా అన్నిచోట్లా ఒకేలా 360 డిగ్రీస్‌లో టీఆర్‌ఎస్ పార్టీపై నమ్మకాన్ని వెలిబుచ్చారన్నారు. గత ఆరేళ్లుగా తాము అమలు చేస్తున్న పథకాలు, అవలంభిస్తున్న విధానాలను ప్రజలు అద్భుతంగా బలపరిచారని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమకు అద్భుతమైన విజయాన్ని అందించడం ద్వారా ఎవరెన్ని మాట్లాడినా పట్టించుకోవద్దన్న సందేశాన్ని ఇచ్చారని చెప్పారు. తాము ఎంచుకున్న, నిర్దేశించుకున్న లక్ష్యాల దిశగా పయణించాలని కూడా తమకు దిశా నిర్దేశం చేశారన్నారు. ఇటువంటి ప్రబలమైన తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజానీకానికి వ్యక్తిగతంగా, పార్టీపరంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అంటూ కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ఇలాంటి ఘన విజయం ఏ పార్టీకీ దొరకదని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.