తెలంగాణ

సీఏఏకు మేం వ్యతిరేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: పౌరసత్వ చట్ట సవరణకు తాము వ్యతిరేకమని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కాశ్మీర్ అంశంలో కేంద్రానికి మద్దతు ఇచ్చిన తాము పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ)కు మాత్రం వ్యతిరేకమని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేశామన్నారు. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమను మద్దతు కోరగా ఇవ్వడం లేదని విస్పష్టంగా చెప్పానని ఆయన తెలిపారు. ఈ చట్ట సవరణను వ్యతిరేకించే రాష్ట్రాలు, పార్టీలు, ము ఖ్యమంత్రులతో త్వరలో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామన్నా రు. ఈ మేరకు శాసనసభలోనూ తీర్మా నం చేస్తామన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ వందకు వంద శాతం సెక్యులర్ పార్టీ అన్నారు. ఎవరి మెప్పు కోసమే తమ పార్టీ విధానాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. ఇండియా సెక్యులర్ దేశమని, ఇక్కడ అందరూ సమానమేనని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేయడానికి తెలంగాణ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పౌరసత్వ చట్ట సవరణ, దేశంలో ఆర్థిక మాంద్యం, కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం అనుసరిస్తున్న విధానాలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకించే సీఎంలతో తాను ఇప్పటికే మాట్లాడానని, అలాగే దీనిని వ్యతిరేకిస్తున్న భావ సారూప్యత కలిగిన రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించి త్వరలో నే హైదరాబాద్‌లో
సమావేశం ఏర్పా టు చేయనున్నట్టు ఆయన తెలిపారు. వచ్చే శాసనసభ సమావేశాల్లోనే దీనిని వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తామన్నారు. అవసరమైతే హైదరాబాద్‌లో పది లక్షల మందితో సభ ఏర్పాటు చేసి పౌర చట్టాన్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తామన్నారు. ఈ అంశంలో కేంద్రం వెనక్కి తగ్గకపోయినా తమ పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. అవసరమైతే జాతీయ స్థాయిలో వ్యతిరేక ఉద్యమానికి తానే నాయకత్వం వహించనున్నట్టు కేసీఆర్ స్పష్టం చేశారు. సెక్యులర్ దేశంలో ఒక మతాన్నో, కులాన్నో పక్కన పెట్టలేమని, అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా భారత్‌కున్న గౌరవాన్ని కోల్పోతామన్నారు. అసలు ఆ మాట కొస్తే ‘నా కంటే కట్టర్ హిందువు ఎవరైనా ఉన్నారా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. తలుపులు మూసి పూజలు చేసే అలవాటు తనకు లేదన్నారు. యాగాలు చేస్తే లక్షలాది మందిని పిలిచే చేస్తానని అన్నారు. స్వాములకు బాజాప్తా పాదాభివందనం చేస్తానని కేసీఆర్ గుర్తు చేశారు.

'చిత్రం...తెలంగాణ భవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్