తెలంగాణ

దుక్కలాగున్నా... సీఎంగా ఎందుకు తప్పుకుంటా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: ‘నేనేం తప్పు చేశానని సీఎం పదవి నుంచి తప్పుకోవాలి. మొన్నీ మధ్య జలుబు, గొంతు నొప్పి, జ్వరమొస్తే హాస్పిటల్‌కెళ్లా. అన్ని పరీక్షలు చేశాక
దుక్కలాగున్నావ్ అని తేల్చారు. అన్నివిధాలుగా బాగునప్పుడు కేటీఆర్‌ను సీఎంను చేయాల్సిన అవసరం ఏముంది? చెప్పండి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేటీఆర్‌ను సీఎంను ఎప్పుడు చేయబోతున్నారని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆయన నవ్వులు పూయించారు. ‘ఉద్యమం చేసి సీఎమ్మయ్యా, ఏం నేను సీఎంగా ఉండడం మీకు ఇష్టం లేదా?’ అని కేసీఆర్ ఎదురు ప్రశ్నించారు. ‘ఇదేమి జబర్దస్తు’ అని ఆయన మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. సీఎం ప్రశ్నకు ఆయన పక్కనే కూర్చున్న తనయుడు కేటీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు ఒక్కసారిగా గొల్లుమన్నారు.
'చిత్రం... కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిపై నవ్వులు పూయించిన కేసీఆర్