తెలంగాణ

ఇంత ఖరీదైన ఎన్నికలు తెలంగాణ ప్రజలు చూడలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: దేశంలో ఎక్కడా ఇంత ఖరీదైన పురపాలిక ఎన్నికలు జరగలేదని , ఇలాంటి ఎన్నికలను గతంలో ఎన్నడూ తెలంగాణ ప్రజలు చూడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్‌మీట్ అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ సీఎంకు బీజేపీ భయం పట్టుకున్నట్టు కనిపిస్తోందని అన్నారు. విలేకరులు మొత్తం కూడా బీజేపీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం ఆయనలో భయాన్ని అద్దం పడుతోందని అన్నారు. ఈ భయం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజలు టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీని చూస్తున్నారని అర్ధం అవుతోందని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం బిల్లు పార్లమెంటులో టీఆర్‌ఎస్ వ్యతిరేకించిన తర్వాత అలా ఎందుకు చేశారో చెప్పాలని ఎన్ని మార్లు ఎవరు అడిగినా సీఎం మాట్లాడలేదని, ఎన్నికలు ముగిశాక మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారో చెప్పాలని లక్ష్మణ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత సీఏఏను వ్యతిరేకిస్తూ మాట్లాడటం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడ మల్లన్న అన్న చందంగా సీఎం వ్యవహరించారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత సీఏఏపై ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పొరుగు దేశాల్లో మత హింసను ఎదుర్కొని దేశంలో ఆశ్రయం పొందుతున్న శరణార్థులకు గౌరవం , రక్షణ కల్పించే సీఏఏపై ఎన్నికల వేళ తప్పుపడితే బైంసాలో ఏ విధంగా ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ప్రజలు టీఆర్‌ఎస్‌ను తిప్పికొట్టారో అదే పరిస్థితి అన్ని మున్సిపాల్టీల్లో ఉండేదని అన్నారు.