తెలంగాణ

ఘోర పరాజయం చవి చూసిన కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామనుకునే ఆశతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. 120 మున్సిపాలిటీల్లో 535 వార్డులు, 9 నగర పాలక సంస్థల్లో 40 డివిజన్లను గెలుచుకుంది. ఐదు మున్సిపాలిటీలు నారాయణఖేడ్, పెద్ద అంబర్‌పేట, వడ్డేపల్లి, తుర్కయాంజల్ , యాదగిరిగుట్ట మున్సిపాలిటీలను గెలుచుకుంది. యాదగిరి గుట్టలో కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్లు మద్దతు లభిస్తే చైర్మన్ పదవి దక్కుతుంది. ఇదే జరిగితే ఐదు మున్సిపాలిటీ చైర్మన్ పదవులు కాంగ్రెస్‌కు దక్కుతాయి. నగర పాలక సంస్థల్లో అయితే బీజేపీ కంటే తక్కువ వచ్చాయి. ఈ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పట్టును కోల్పోవడం ఆ పార్టీకి ఆందోళన కలిగించే అంశం. నిజామాబాద్ నగర పాలక సంస్థలో కేవలం రెండు సీట్లు చేజిక్కించుకుని ఈ పార్టీ మునుపెన్నడూ లేని విధంగా పతనాన్ని చవి చూసింది. రామగుండంలో 11సీట్లు, బండగ్‌పేటలో 7, మీర్‌పేటలో 3, బండ్లగూడజాగీర్‌లో 5, బోడుప్పల్‌లో 7, ఫీర్జాది గూడలో 3, జవహర్‌నగర్‌లో 2 డివిజన్లను గెలుచుకుంది. నిజాంపేట నగర పాలక సంస్థలో ఒక్క డివిజన్ కూడా గెలుచుకోలేకపోయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేసిన హుజూర్‌నగర్‌లో 6, కోదాడలో 8, సూర్యాపేటలో 15 సీట్లలో గెలిచి పేలవమైన ప్రదర్శన చాటింది. చౌటుప్పల్‌లో 5, ఆలేరులో 1, పోచంపల్లిలో 2, నేరెడుచర్లలో 7, తిరిమలగిరిలో 4, దేవరకొండలో 4 మిర్యాలగూడలో 18, నందికొండలో 3, చిట్యాలలో 4 సీట్లు తెచ్చుకుంది. ఒక్క యాదగిరి గుట్టలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు చెరిసగం స్థానాలు వచ్చాయి. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ప్రతిష్టాకరమైన నల్లగొండలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు చెరిసగం సీట్లు వచ్చాయి. ఇక్కడ బీజేపీకికి ఆరు సీట్లు వచ్చాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా పరిస్థితి అధ్వాన్నమనే చెప్పవచ్చును. ఈ జిల్లాలో వడ్డేపల్లి అనే చిన్న మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్రం మొత్తం మీద విశే్లషిస్తే మంచిర్యాలలో 14 సీట్లు, కామారెడ్డిలో 12, సంగారెడ్డిలో 12 సీట్లు, మిర్యాలగూడలో 18 సీట్లు, జనగాంలో 10 సీట్లు, మహబూబాబాద్‌లో 10, భవనగిరిలో 11 సీట్లు వచ్చాయి. ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడలేదు. రాష్ట్రంలో దళితులు,మైనారిటీలు,బలహీనవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉండేది. కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఓటు బ్యాంకు టీఆర్‌ఎస్‌కు సింహభాగం, ఆ తర్వాత కొంత భాగం బీజేపీకి తరలివెళ్లినట్లు విదితమవుతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేసినా, పోల్‌మేనేజిమెంట్ బాగా చేసినా ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయని చెప్పవచ్చును. సీఎల్‌పీనేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహించిన మధిర మున్సిపాలిటీతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్ కైవశం చేసుకుంది. మల్కాజగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సొంత ఊరు కొడంగల్ కోస్గి మున్సిపాలిటీ కూడా గులాబీ వశమైంది. దుబ్బాక, నర్సాపూర్, భైంసా, చెన్నూరు, భూపాలపల్లి, భీంగల్, తక్కుగూడ, ఆమన్‌గల్, కొల్లాపూర్, సత్తుపల్లి, ఇల్లెందులో కాంగ్రెస్ ఒక్క వార్డును కూడా గెలుచుకోలేకపోయింది. నల్లగొండ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ నుంచి గట్టిపోటీ ఎదురైనా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషి వల్ల 48వార్డుల్లో కాంగ్రెస్‌కు 20, టీఆర్‌ఎస్‌కు 20 వార్డులు వచ్చాయి. ఇక్కడ బీజేపీకి ఆరు చోట్ల గెలిచింది. టీఆర్‌ఎస్ మున్సిపల్ చైర్మన్ పదవిని తన ఖాతాలో వేసుకునేందుకు ఎత్తుగడ వేస్తున్నట్లు సమాచారం. కాగా బీజేపీకి చెందిన ఆరుగురు సభ్యులు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే కాంగ్రెస్ రెపరెపలాడే అవకాశాలున్నాయి. సిద్ధాంత రీత్యా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో వైరం ఉన్న బీజేపీ ఈ రెండు పార్టీల్లో ఒక పార్టీకి మద్దతు ఇవ్వక తప్పదు. ఇక్కడ మైనారిటీల అండదండలు కోమటిరెడ్డికి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతు తీసుకోవడానికి కాంగ్రెస్ వెనకాడుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.