తెలంగాణ

టీఆర్‌ఎస్‌పై నైతిక విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: టీఆర్‌ఎస్‌పై బీజేపీ నైతిక విజయాన్ని సాధించిందని పార్టీ శ్రేణులు విశే్లషిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వల్ప సంఖ్యలో మినహా అన్ని మున్సిపాల్టీల్లో బీజేపీ తొలిసారిగా ప్రాతినిధ్యం వహించడమేగాక, మూడింట మెజార్టీ సాధించిందని పార్టీనేతలు చెబుతున్నారు. పురపాలిక ఎన్నికల్లో కమలం విస్తరిస్తోందని లక్ష్మణ్ విశే్లషించారు. కమలం పూర్తిగా వికసించకపోయినా, బీజేపీ విస్తరణ కోసం దోహపడ్డాయని లక్ష్మణ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సంవత్సరకాలంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజాతీర్పు ఎంత వ్యత్యాసంగా ఉందో ఒకమారు విశే్లషిస్తే ఏడున్నర శాతం ఓట్లు రాగా, పార్లమెంటు ఎన్నికల్లో 20 శాతం ఓట్లు, నలుగురు ఎంపీలు గెలిశారని, పురపాలిక ఎన్నికల్లో 40 శాతం ఓట్లు పడ్డాయని చెప్పారు. గత సారి తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకున్నామని, పరిమితంగా పోటీ చేసి కొద్దిపాటి సీట్లు మాత్రమే పొందామని, ఈసారి ఒంటరిగా పోటీ చేసి మంచి ఫలితాలను సాధించామని అన్నారు. ఒంటరిగా పోటీచేసిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. టీఆర్‌ఎస్ ఎంఐఎంతో కలిసి పోటీచేయగా, వామపక్షాలు అంతా కలిసి పనిచేశాయని కానీ బీజేపీ ఒంటరిగా పోటీచేశామని అన్నారు. ఒంటరిగా ధనం మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, కాంట్రాక్టర్ల మాఫియాతో పోరాడామని, అధికార పార్టీకి కొమ్ముకాసిన పోలీసు యంత్రాంగంతో కూడా పోరాడమని అన్నారు. అధికార అక్రమార్కులతో పోరాడామని, వార్డుల్లో కోటి రూపాయిలు కూడా ఖర్చు చేసిన ఉదంతాలున్నాయని అన్నారు. ఓటుకు 30వేల రూపాయిలు ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయని అన్నారు. ఓటుకు కొన్ని వార్డుల్లో ఐదు వేల వరకూ ఇచ్చారని, మరో పక్క అధికారాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. ఓటర్ల లిస్టు నమోదు మొదలు, వార్డుల విభజన, ఎన్నికల ప్రక్రియను కూడా అక్రమంగా మార్చేశారని, ఎన్నికల కమిషన్ సైతం నిస్సహాయత వ్యక్తం చేసిందని అన్నారు. తెలంగాణ ప్రజలు ఇదంతా గమనించారని అన్నారు. ఇంత ఖరీదైన ఎన్నికలను ఎక్కడా ప్రజలు చూడలేదని లక్ష్మణ్ అన్నారు. అయినా బీజేపీ మంచి ఫలితాలను సాధించిందని, మూడు మున్సిపాల్టీలను సొంతంగా గెలిచామని, కొన్నింట సింగిల్ లార్జెస్టుగా గెలిచామని అన్నారు. అమన్‌గల్, తుక్కుగూడలో గెలిచామని, కార్పొరేషన్లలో కూడా కీలక పాత్ర పోషించబోతున్నామని చెప్పారు. దొడ్డిదారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లతో గెలిచే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అనేక చోట్ల దాదాపు 30 చోట్ల టీఆర్‌ఎస్ కావల్సిన సంఖ్యను సాధించలేకపోయిందని అన్నారు. పనితీరుపై ఫలితాలు ఆధారపడి ఉంటాయని కేసీఆర్ చెప్పారని, రాష్ట్రం మొత్తం దేవుడెరుగని, ఎన్నికలకు పూర్తి బాధ్యత తీసుకున్న కేటీఆర్ ఇలాకాలోనే బీజేపీ గెలిచిందని అన్నారు. టీఆర్‌ఎస్ స్వీప్ చేసింది ఎక్కడా అని నిలదీశారు. ఇంత డబ్బు ఖర్చు చేసినా, ఓట్లు కొనుగోలుచేసినా టీఆర్‌ఎస్ పరిస్థితి ఇంత దారుణంగా ఉందని అన్నారు. నాలుగైదు మినహాయిస్తే అన్ని మున్సిపాల్టీల్లో బీజేపీ నేడు ప్రాతినిధ్యం వహించబోతోందని చెప్పారు. చాలా స్పష్టమైన సంకేతాలను ప్రజలు హెచ్చరిక రూపంలో ఇచ్చారని అన్నారు. రేపు జరగబోయే హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గ్రాఫ్ మరింత పడిపోతుందని, బీజేపీ గ్రాఫ్ మరింత పెరుగుతుందని చెప్పారు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలో ఏం జరిగిందని నిలదీశారు. బీజేపీ పోటీయే కాదని చాలా సందర్భాల్లో కేటీఆర్ చెప్పారని, కోట్లు ఖర్చు పెట్టే అభ్యర్ధులు బీజేపీకి లేరని ప్రజల నాయకులు మాత్రమే ఉన్నారని, మాఫియా లీడర్లు బీజేపీకి లేరని పేర్కొన్నారు. కేటీఆర్ అహంకారంతో, అధికారమదంతో మాట్లాడుతున్నారని వాటిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్ దయనీయ పరిస్థితికి చేరుకుందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి నగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ, కంటోనె్మంట్ ఎన్నికల్లో చాలెంజ్‌గా తీసుకుని విజయం సాధిస్తామని, ప్రభుత్వ విధానాలపై పోరాటాలను ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో విజయం సాధిస్తే, ఈ ఎన్నికల్లో ఎందుకు ఇంత డబ్బు ఖర్చు చేశారో టీఆర్‌ఎస్ చెప్పాలని అన్నారు.
'చిత్రం... మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్