తెలంగాణ

ప్రతిపక్షం లేకుండా చేయడంలో టీఆర్‌ఎస్ దిట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: ప్రతిపక్షం లేకుండా గారడీలు చేయడంలో టీఆర్‌ఎస్ పార్టీ దిట్టని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై నైరాశ్యం చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అన్నారు. ప్రత్యర్థి పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులను ప్రలోభపెట్టే పనిలో టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రయత్నిస్తుందన్నారు. ప్రతపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులను లోబరుచుకోవడం కేసీఆర్‌కు కొత్త కాదన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, వారికి మంత్రి పదవులు ఇచ్చి, రాజ్యాంగాన్ని మంటకలిపిన ఘనత కూడా కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. అక్కడినుంచి మొదలైన ఈ ప్రహసనం, జడ్పీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ తరఫున గెలిచిన అభ్యర్థులను కొంటారన్నారు. చివరకు మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికైన ప్రతిపక్షానికి చెందిన ప్రజా ప్రతినిధుల వరకు లొంగదీసుకునే ప్రక్రియ కొనసాగుతూనే ఉందన్నారు. ఓటు వేసి గెలిపించినా, టీఆర్‌ఎస్ పార్టీ ప్రలోభాలకు గురై ఆ పార్టీలో చేరుతారనే సంకేతం ప్రజల్లోకి వెళుతారన్నారు. ఇలాంటి ఎత్తులు, జిత్తులు వేయడంలో సీఎం దిట్ట అన్నారు. గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీలో ఎన్నింటిని అమలు చేస్తారనే ప్రశ్నకు మాత్రం కేసీఆర్ వద్ద దొరకదన్నారు.