తెలంగాణ

న్యాయమూర్తుల పోస్టులు భర్తీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న న్యాయస్థానాల్లో న్యాయాధికారులు, న్యాయమూర్తుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్ (ఐఏఎల్) ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ కోరారు. హైకోర్టులో న్యాయమూర్తుల స్థానాలను కూడా భర్తీ చేయాలని, అలాగే న్యాయవాదుల సంక్షేమానికి కావల్సిన నిధులను ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించాలని ఆయన కోరారు. గుర్రం రాజశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఐఏఎల్ రాష్ట్ర సమితి సమావేశంలో ప్రభాకర్ మాట్లాడుతూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్ పదో జాతీయ మహాసభలు 22,23,24 తేదీల్లో విజయవాడలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని అన్నారు. సమావేశంలో ఏవీ కృష్ణారావు, బార్ కౌన్సిల్ సభ్యులు ఎంకే రత్నం, రాజిరెడ్డి, జయశ్రీనివాస్, కే రామమూర్తి, ఉదయభాస్కర్, ఎ దామోదర్, దయాశంకర్ తదితరులున్నారు. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి అందరూ సహకరించాలని అన్నారు.