తెలంగాణ

మన రాజ్యం మనమే ఏలుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: వామపక్షాలే బహుజన ఫ్రంట్‌ను భుజాన వేసుకుని రాజ్యాధికారం కోసం కృషి చేయాలని ఎంసీపీఐయు జాతీయ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ పేర్కొన్నారు.రాజ్యాధికారం లేకుండా ప్రజల వౌలిక సమస్యలైన ఇల్లు, నీరు, గుడ్డ, తిండి, వైద్యం, విద్య లాంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవని అన్నారు. జనాభాలో మెజార్టీ ప్రజలైన బీసీ, ఎస్సీ,స్టీలు , మైనార్టీలు వారి జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాధికారంలోకి రాకుండా ఆ వర్గాల ప్రజలు చట్టసభలకు ఎన్నిక కాకుండా రూపొందించే చట్టాల్లో వారి భాగస్వామ్యం లేకండా సామాజిక , రాజకీయ , ఆర్ధిక సమానత్వం సాధ్యం కాదని పేర్కొన్నారు. 2018 డిసెంబర్‌లో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్ ఈ లక్ష్యంతోనే 28 సంస్థల భాగస్వామ్యంతో 107 స్థానాల్లో పోటీ చేసిందని, బహుజనుల ఆత్మగౌరవ నినాదాన్ని గ్రామస్థాయి వరకూ తీసుకువెళ్లగలిగిందని అన్నారు. బహుజనుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగిందని, ఈ స్ఫూర్తితోనే రానున్న కాలంలో తెలంగాణలో అందర్నీ ఐక్యం చేస్తుందని అన్నారు. మన రాజ్యాన్ని మనమే ఏలుకుందాం అని టీ మాస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచ అయిలయ్య పిలుపునిచ్చారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ద్వితీయ ఆవిర్భావ సభ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం నాడు విజయవంతం అయినట్టు ఎంసీపీఐ (యు) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వనం సుధాకర్ తెలిపారు. ఈ సభకు అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ ప్రధాన వక్తగా హాజరయ్యారని, ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి కాకి మాధవరావు, టీ మాస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె ఐలయ్య, సామాజిక ఉద్యమ నేత సాంబశివరావు, కవి, రచయిత జయరాజు సహా సామాజిక ఉద్యమ నేతలు, మేథావులు, కళాకారులు, బీఎల్‌ఎఫ్ భాగస్వామ్య పక్షాల నేతలు ప్రసంగించారని పేర్కొన్నారు.