తెలంగాణ

గెలుపోటములకు పొంగిపోదు, కృంగిపోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓటములకు పొంగిపోదు, కృంగిపోదని ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఇక్కడ ఆయన గాంధీభవన్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై పార్టీ అధిష్టానం సమీక్షిస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ ఎన్నుకున్న ఆయుధం బ్లాక్ మెయిల్ అన్నారు. ఓడిపోతే పదవులుండవని మంత్రులను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేశారన్నారు. దీంతో పోలీసులపై వత్తిడి తెచ్చి కాంగ్రెస్ నేతలపై అడ్డుగోలుగా కేసులు పెట్టి బెదిరించారన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ ప్రజలను, ఓటర్లను నమ్ముకోలేదన్నారు. డబ్బులు, మద్యం, పోలీసు, ఎన్నికల నిర్వహణ అధికారులపై ఆధారపడి నెగ్గారన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభివృద్ధిని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. కొంపల్లిలో ఎన్నికల నిర్వాహకులు, గెలిచిన అభ్యర్థులు ఓడినట్లు చూపించారన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన మంత్రులు ఎర్రబెల్లి, కేటీఆర్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌పై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. 25 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌కు 50 శాతం వార్డులు రాలేదన్నారు. అయినా అక్కడ టీఆర్‌ఎస్ గెలిచినట్లు చెబుతున్నారన్నారు. సిరిసిల్లలో కేటీఆర్‌ను వ్యతిరేకిస్తూ పది మంది, గజ్వేల్‌లో కేసీఆర్‌ను వ్యితిరేకిస్తూ ఆరు మంది రెబల్స్ గెలిచారన్నారు. త్వరలోనే విద్యుత్ చార్జీలు డబుల్, ఇంటిపన్ను ఆరంతలు పెరుగుతుందన్నారు. మిషన్ భగీరథనీరుకు నాలుగంతలు పెంచి బిల్లు వసూలు చేశారన్నారు. టీఆర్‌ఎస్ గెలుపు ప్రజలకు పన్నుల మోత మోగించబోతోందన్నారు. ఈ ఎన్నికలు బ్లాక్ మెయిల్‌తో మొదలై బ్లాక్ మనీతో ముగుస్తున్నాయన్నారు. ఈ ఫలితాలు మమ్మలను ఏ మాత్రం కృంగదీయవన్నారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ తరఫున పోరాడుతూనే ఉంటామన్నారు. టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం ప్రత్యక్ష భాగస్వామి, బీజేపీ పరోక్ష భాగస్వామి అన్నారు. కేసీఆర్‌తో అవగాహన లేకుండా బంగారు కూలి పేరిట చేసిన అవినీతి ఫైల్‌ను కేంద్రం ఎందుకు తొక్కి పెట్టిందన్నారు. కొడంగల్ నియోజకవర్గం కోస్గి మున్సిపాలిటీ కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీచార్జీ చేశారన్నారు. గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులను బలవంతంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కారులో పోలీసులు కూర్చోబెట్టారన్నారు. గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులను బందోబస్తుతో వాళ్ల ఇంటికి పంపిస్తామని చెప్పిన ఎస్పీ, 16వ వార్డు అభ్యర్థి ఎల్లమ్మను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కారులో ఎక్కించారన్నారు.