తెలంగాణ

లక్ష్యాలను సాధించిన గిరిజన సహకార సంస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసీసీ) గత రెండు సంవత్సరాల్లో నిర్దేశిత లక్ష్యాలను సాధించింది. హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో జరిగిన జిసీసీ బోర్డ్ మీటింగ్ వివరాలను శనివారం ఇక్కడ విడుదల చేశారు. 2018-19 సంవత్సరానికి 250 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించగా, 238 కోట్ల రూపాయల టర్నోవర్‌ను సాధించింది. అలాగే 2019-20 సంవత్సరంలో 400 కోట్ల రూపాయలను టర్నోవర్‌గా లక్ష్యాన్ని పెట్టుకోగా 2019 డిసెంబర్ చివరి వరకే 200 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరివరకు లక్ష్యాలను పూర్తిగా సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు జీసీసీ చైర్మన్‌గా ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్‌హర్ మహేశ్‌దత్ ఎక్కా బోర్డ్ సమావేశంలో తెలిపారు. గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎక్కా వివరించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు, అడిషనల్ పీసీసీఎఫ్ ఆర్. సిద్దానంద్ కుక్రేటి, సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్ ఎన్. శ్రీధర్, జీసీసీ జనరల్ మేనేజర్ వి. సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

'చిత్రం... జీసీసీ బోర్డ్ సమావేశంలో పాల్గొన్న అధికారులు ఎక్కా తదితరులు