తెలంగాణ

చట్టం తెచ్చినవారే పెడబొబ్బలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 27: ఎక్స్ అఫీషియోలకు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కల్పించిందే కాంగ్రెస్ హయాంలోనని, ఇప్పుడు అదే పార్టీ ఇపుడు పెడబొబ్బలు పెడితే ఎలాగని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుప్రశ్నించారు. చట్టంలో కల్పించిన అధికారాన్ని తాము వినియోగించుకుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. పేరుకే జాతీయ పార్టీలు కానీ చేసేవన్నీ సిల్లీ రాజకీయాలని కేటీఆర్ దుయ్యబట్టారు. బీజేపీకి తాము బీ-టీమ్ అనే కాంగ్రెస్, కాంగ్రెస్‌కు ఏ టీమ్ అనే బీజేపీ ఇప్పుడు ఎవరికి ఎవరు ఏ టీమో, బీ టీమో మున్సిపల్ ఎన్నికల్లో నిస్సిగ్గుగా బయటపడ్డాయని విమర్శించారు. కాంగ్రెస్-బీజేపీ పార్టీల అపవిత్ర పొత్తులు, అవగాహన బహిర్గతమయ్యాయని ఆయన దుయ్యబట్టారు. మున్సిపల్ పాలక వర్గాల ఎన్నికలు ముగిసిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ చైర్మన్ పదవి దక్కేందుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వగా మరికొన్నిచోట్ల కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతు ఇచ్చిందన్నారు. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ రెండు పార్టీలు నిస్సిగ్గుగా బాహాటంగా కలిసే పనిచేశాయని విమర్శించారు. జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీ తమను ఎదుర్కోలేక అనైతికంగా ఒకటయ్యాయని ఆయన దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వానికి అండగా ఉన్నారని మరోసారి చాటుకున్నారని అన్నారు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలకుగాను 112, 10 మున్సిపల్ కార్పొరేషన్లకుగాను పదింటికి పదిని కూడా కారుకే పట్టం కట్టారని వివరించారు. ఇంతటి ఘన విజయం మాములు విషయం కాదని, కలలో కూడా ఊహించనంతటి గొప్ప విజయంగా కేటీఆర్ అభివర్ణించారు. మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో నాలుగేళ్ల వరకు ఏ ఎన్నికలు లేవని, ఇకనుంచి పూర్తిగా పాలనపైనే దృష్టి సారిస్తామన్నారు. ఇదిలావుండగా, మున్సిపల్ కొత్త చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని
ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ కొత్త చట్టం ప్రకారం పనిచేయని మున్సిపల్ పాలకవర్గాలను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఏ పార్టీకి చెందిన పాలకవర్గం అయినప్పటికీ తమ విధి నిర్వహణలో తప్పు చేస్తే ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. ఎన్నికైన పాలక వర్గాలకు త్వరలోనే మున్సిపల్ కొత్త చట్టంపై అవగాహన కల్పించేందుకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. పల్లె ప్రగతి విజయవంతమైన తరహాలోనే త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చినట్టుగానే మున్సిపాలిటీలకు కూడా ఇవ్వబోతున్నామన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్త చట్టం ప్రకారం సెల్ఫ్ డిక్లరేషన్‌తో భవన నిర్మాణాలకు అనుమతి ఇస్తామని, అలాగే ఆస్తి పన్నుకు కూడా సెల్ఫ్ డిక్లరేషన్‌ను అమలు చేస్తామన్నారు. సామాజిక న్యాయాన్ని పాటించడంలో తనకు సాటిలేదని టీఆర్‌ఎస్ మరోసారి నిరూపించుకుందన్నారు. బలహీన వర్గాలకు చెందిన వారికి మున్సిపల్ చైర్ పర్సన్, మేయర్ పదవుల్లో పెద్దపీట వేసినట్టు కేటీఆర్ వివరించారు.

*చిత్రం...ప్రగతిభవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్