తెలంగాణ

ఇందూరులో ‘పుర’ పీఠాలన్నీ గులాబీ ఖాతాలోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 27: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇందూరు నగర పాలక సంస్థతో పాటు అన్ని మున్సిపల్ చెర్మన్ పదవులను అధికార టీఆర్‌ఎస్ పార్టీ సునాయసంగా కైవసం చేసుకుంది. కీలక పదవుల కోసం ప్రతిపక్ష పార్టీల నుండి నామమాత్రంగానైనా పోటీ ఎదురుకాలేకపోయింది. పైపెచ్చు కాంగ్రెస్, ఎంఐఎం సహా స్వతంత్ర అభ్యర్థులంతా మేయర్, చైర్మన్ అభ్యర్థుల ఎంపిక సందర్భంగా తెరాసకు బాసటగా నిలువడం విశేషం. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో 60 డివిజన్‌లకు గాను బీజేపీ 28, ఎంఐఎం 16, తెరాస 13, కాంగ్రెస్ 2, ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలుపొందారు. అయితే ఎంఐఎం, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థి మద్దతును సైతం కూడగట్టుకుని తెరాస మేయర్ పదవిని తన ఖాతాలో వేసుకుంది. బీసీ మహిళకు ఈ పదవి రిజర్వ్ కావడంతో, ఆ కేటగిరికి చెందిన దండు నీతూకిరణ్ మేయర్‌గా ఎన్నికవగా, డిప్యూటీ మేయర్‌గా ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ ఇద్రిస్‌ఖాన్ గెలుపొందారు. వీరికి తెరాస, ఎంఐఎంతో పాటు ఇద్దరు కాంగ్రెస్, ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్‌లు కూడా అనుకూలంగా నిలిచారు. ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు తెరాస ఎమ్మెల్సీలు కూడా మద్దతుగా ఓటు వేశారు. బీజేపీ సైతం మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పోటీ చేసినప్పటికీ, సరిపడా మెజారిటీ లేకపోవడంతో ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది.
ఇదిలాఉండగా, ఉమ్మడి జిల్లాలోని మిగతా ఆరు మున్సిపాలిటీల్లోనూ స్పష్టమైన మెజారిటీని సాధించినందున అన్ని చోట్లా తెరాస పార్టీయే ఏకపక్షంగా చైర్మెన్, వైస్ చైర్మెన్ పదవులను దక్కించుకుని తన ఆధిపత్యాన్ని చాటుకుంది. చైర్మన్ పదవులకు ఖరారైన రిజర్వేషన్‌లను అనుసరిస్తూ సంబంధిత కేటగిరిలకు చెందిన వారిని తెరాస అధిష్టానం ఎంపిక చేస్తూ సీల్డు కవర్‌లలో వారి పేర్లను పంపించింది. ఈ మేరకు ఎమ్మెల్యేల పర్యవేక్షణలో సభ్యులు వారిని చైర్మన్‌లు, వైస్ చైర్మన్లుగా ఎన్నుకున్నారు. బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా తూము పద్మావతి ఎన్నికవగా, వైస్ చైర్మన్‌గా ఎత్తెషామ్‌కు అవకాశం కల్పించారు. ఆర్మూర్ మున్సిపల్ చెర్మన్‌గా పండిత్ వినిత్, వైస్ చైర్మన్‌గా మున్నూభాయ్ ఎన్నికయ్యారు. తెరాస క్లీన్‌స్వీప్ చేసిన భీమ్‌గల్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మల్లెల రాజశ్రీ, వైస్ చైర్మన్‌గా గున్నాల బాలభగత్ గెలుపొందారు. కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నిట్టు జాహ్నవి, వైస్ చైర్‌పర్సన్‌గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. బాన్సువాడ మున్సిపల్ చైర్మన్‌గా జంగం గంగాధర్, వైస్ చెర్మన్‌గా జుబేర్‌లను ఎన్నుకున్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా కుడుముల సత్యనారాయణ, వైస్ చైర్‌పర్సన్‌గా ఎం.సుజాత ఎన్నికయ్యారు.