తెలంగాణ

రజాకార్ల కంటే దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం ఆదేశం మేరకు పోలీసులు రజాకార్ల కంటే దారుణంగా ప్రవర్తించారని, ఈ అరాచకానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మున్సిపపల్ ఎన్నికల ప్రకటనకు ముందే జిల్లా మంత్రులను, ఎమ్మెల్యేలను సీఎం బ్లాక్‌మెయిల్ చేశారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకున్న డబ్బుతో ఇతర పార్టీల నాయకులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఇవి నిజాయితీగా జరిగిన ఎన్నికలు కావన్నారు. ఎక్స్‌అఫీషియో ఓట్లతో యాదగిరిగుట్ట మున్సిపల్ పీఠాన్ని కైవశం చేసుకున్నారన్నారు. అదేవిధంగా ఆదిభట్లలో కాంగ్రెస్‌కు మెజారిటీ వచ్చినా తమ కౌన్సిలర్‌ను తీసుకునిపోయి టీఆర్‌ఎస్ నుంచి చైర్మన్ చేశారన్నారు. పెద్దఅంబర్‌పేటలో తమ పార్టీ కౌన్సిలర్లను ఎత్తుకుపోయారన్నారు. చౌటుప్పల్‌లో సీపీఎం సభ్యులను కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. గత 25 సంవత్సరాల్లో ఇంత అధ్వాన్నంగా ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చర్యలను ఖండించాలని, తమ పార్టీ ఈ తండ్రీ కొడుకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కేటీఆర్ సిరిసిల్లలో రెబెల్స్
పోటీచేస్తే వారిని సస్పెండ్ చేస్తామని చెప్పి మళ్లీ పార్టీలో చేర్చుకున్నారన్నారు. గజ్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా 74 ఏళ్ల నారాయణ రెడ్డిని ఎంపిక చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వల్ల నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ఓటమి చెందారన్నారు. నేరేడుచర్లలో 25న తయారైన ఓటర్ల జాబితాలో ఇపుడు శేరి సుభాష్ రెడ్డి పేరును చేర్చారన్నారు.
గ్రామగ్రామాన తిరిగి టీఆర్‌ఎస్ అనైతిక చర్యలను ఎండగడతామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలో టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పొత్తుపెట్టుకున్నాయని అన్నారు. ఆదిభట్లలో కౌన్సిలర్‌ను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని చైర్మన్ చేశారన్నారు. ఈ అనైతిక విధానాలకు ఒక రోజు తగిన మూల్యం చెల్లించేరోజు టీఆర్‌ఎస్‌కు వస్తుందన్నారు. తాము కేసీఆర్, కేటీఆర్‌పై ఆధారాలపై ఈడీ, విజిలెన్స్‌కు నివేదిక ఇస్తామన్నారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో కేసీఆర్ వైఖరిని ఎండగడతామన్నారు. తమ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చిన సభ్యులపై లీగల్‌గా పోరాడతామన్నారు. కేసీఆర్, కేటీఆర్ అరాచక పాలన కోసమే తెలంగాణ వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. తనకు పీసీసీ పదవి వచ్చినా రాకపోయినా, పార్టీ కార్యకర్తగా పనిచేస్తానన్నారు.

*చిత్రం... కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి