తెలంగాణ

కేంద్ర సంస్థల ప్రైవేటీకరణ దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: జాతికి గర్వకారణమైన ఎయిర్ ఇండియా విమాన సంస్థలను అమ్మివేయడం విచారకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. విమాన సర్వీసులను కేవలం లాభసాటిగానే కాకుండా సామాజిక బాధ్యతగా చూడాలని, యుద్ధ రంగంలో, ప్రకృతి వైపరీత్యాలలో వెనుకబడిన ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వ రంగ సంస్థలు సేవలు చేయగలుగుతాయని అన్నారు. ప్రైవేటు రంగంలో విమాన సర్వీసులు లాభసాటిగా ఉంటేనే నడుస్తాయని, దేశానికి కష్టకాలంలో అనుకున్న సాయం అందించలేవని అన్నారు. చైనాలో విపత్కర పరిస్థితి ఏర్పడితే ఎయిర్ ఇండియా సంస్థ ఎయిర్ క్రాఫ్ట్‌ను పంపించిందని అన్నారు. విమాన సంస్థకు కూడా రాజకీయ లోపాలతోనే సంస్థ దాపురించిందని అన్నారు. ప్రపుల్ల కుమార్ మహంతా మంత్రిగా ఉన్నపుడు 65 ఎయిర్ ఇండియా విమానాలు అవసరం కాగా 111 ఎయిర్ క్రాఫ్ట్‌లను కొన్నారని, దానికి కమిషన్ల రూపంలో ముడుపులు ముట్టాయని అన్నారు. అంతర్జాతీయ సీట్ల ఒప్పందంలో కూడా 15వేల కోట్ల రూపాయిల మేర అవినీతి జరిగిందని అన్నారు. లాభసాటి రూట్లన్నీ ప్రైవేటు సంస్థలకు అప్పగించి నష్టాల రూట్లు అన్నీ ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చారని, ఇదంతా కలిపితే 58వేల కోట్ల బ్యాంకుల్లో అప్పుగా తేలిందని అన్నారు. పారిశ్రామిక రంగాలకు అప్పుగా ఇచ్చిన 8 లక్షల కోట్ల రూపాయిలను నిరర్ధక ఆస్తులుగా ప్రకటించి రద్దు చేయగలిగారని, కానీ 58వేల కోట్ల రూపాయిలు అప్పులు రద్దు చేసి పునరుద్ధరణ పథకాన్ని ప్రవేశపెట్టి మూడు సంవత్సరాల పాటు ప్రోత్సహిస్తే లాభాలు వస్తాయని యూనియన్లు చెబుతున్నాయని, కానీ కేంద్రం వారి వాట వినడం లేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం విమాన సంస్థలు, బీఎస్‌ఎన్‌ఎల్ ప్రభుత్వ రంగం నుండి తప్పించి సామాజిక బాధ్యతల నుండి తప్పించుకుంటున్నాయని, ముఖ్యమైన సంస్థలను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తోందని, ఫలితంగా కార్పొరేట్ రంగం చేసే అప్పులను ప్రభుత్వం రద్దుచేస్తోందని నారాయణ వ్యాఖ్యానించారు.
ఈ విధంగా సామాన్య ప్రజల నుండి వసూలుచేసే పన్ను ఖజానాలో నింపి దాని నుండి కార్పొరేట్ కుటుంబాలకు సేవ చేసే పనిలో కేంద్రం నిమగ్నమైందని ఆరోపించారు.
బ్యాంకు సమ్మెకు ఎఐటీయూసీ మద్దతు
బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఎఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ చెప్పారు. జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేసినట్టు ఆయన చెప్పారు.