తెలంగాణ

మహిమాన్విత క్షేత్రాలుగా యాదాద్రి, చెర్వుగట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 3: తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్న తిరుపతి సరసన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ అదే రీతిలో తెలంగాణ శ్రీశైలంగా చెర్వుగట్టు పుణ్యక్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం చెర్వుగట్టును సందర్శించిన గుత్తా సుఖేందర్‌రెడ్డికి దేవాలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి ఘనంగా సత్కరించి ఆలయ జ్ఞాపికను అందించారు. ముందుగా గర్భాలయంలో మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి మహామండపంలో కొలువుతీర్చిన పార్వతీపరమేశ్వరులను దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతు యాదాద్రి, చెర్వుగట్టులో తెలంగాణలో మహిమాన్విత వైష్ణవ, శైవ క్షేత్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. చెర్వుగట్టు ఇప్పటికే నిత్యం వేలాది మంది భక్తుల సందర్శనతో ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. చెర్వుగట్టులో కాటేజీల నిర్మాణాలు, భక్తుల వసతుల కోసం, కొండ పరిసర ప్రాంతాలను పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేయనుందన్నారు. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక భావన కల్గిన మహోన్నత వ్యక్తియని అందుకే యాదాద్రితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారన్నారు. ఉమ్మడి జిల్లాలోని యాదాద్రి, చెర్వుగట్టులను అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు జిల్లా వాసిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అనంతరం కొండపైన గుత్తా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసిన అధికారులను, ప్రజాప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రెగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి అనే్నపర్తి సులోచన, స్థానిక సర్పంచ్ బాలకృష్ణ, ఎంపీటీసీ రాజిరెడ్డి, ఎంపీపీ ఎస్.నరేందర్‌రెడ్డి, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

*చిత్రం...చెర్వుగట్టులో పూజలు చేస్తున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి