తెలంగాణ

మహా జాతరకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి/తాడ్వాయి, ఫిబ్రవరి 3: సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తుల కోసం జాతరలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సర్వం సిద్ధం చేశామని ములుగు జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ.పాటిల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆసియాఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి రకాల సౌకర్యాలు కల్పించామన్నారు. ముఖ్యంగా జాతరలో పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం, 24 గంటల పాటు విద్యుత్ సరఫరా, 28 పార్కింగ్ స్థలాలు, జాతరలో ముఖ్య కూడళ్ల వద్ద 350 సీసీ కెమెరాలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కోసం 100 పడకలు సిద్ధం చేసినట్లు తెలిపారు. జాతరలో భక్తులకు వైద్య సేవలందించేందుకు 18 వైద్యశిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలందించేందుకు 10 వేల మంది పోలీసు సిబ్బందిని నియమించినట్టు వారు తెలిపారు. హన్మకొండ నుండి మేడారానికి వచ్చే ప్రైవేటు వాహనాలకు పస్రా క్రాస్ నుంచి నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆర్టీసీ బస్సులు తాడ్వాయి మీదుగా మేడారానికి వచ్చేలా చర్యలు తీసుకున్నట్టు వారు తెలిపారు. ఇప్పటికే భక్తుల రాక మొదలైనందున ట్రాఫిక్ జామ్‌లు కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి నాలుగు కిలో మీటర్లకు ఒక పోలీస్ క్యాంపు, పెట్రోలింగ్ వాహనం అందుబాటులో ఉంటుందని, అలాగే ట్రాఫిక్ జామ్ తలెత్తినట్టయితే కమాండ్ కంట్రోల్‌రూం ద్వారా పోలీసులకు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రైవేటు వాహనాల్లో జాతరకు వచ్చే భక్తులు రోడ్డుపై వాహనాలు నిలుపవద్దని, రోడ్డుపై వాహనాలు నిలిపినట్టయితే కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తామని చెప్పాన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపినా ఇదే రీతిలో చర్యలు తీసుకుంటామన్నారు. పస్రా నుండి నార్లాపూర్ మీదుగా మేడారం వచ్చే వాహనాలకు ప్రతి రెండు కిలో మీటర్లకు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దర్శనం నిమిత్తం లోపలికి వెళ్లే భక్తులు గద్దెల వద్ద ఏర్పాటు చేసిన సెంట్రింగ్ వద్దే దర్శనం చేసుకోవాలన్నారు. జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ రహిత జాతర జరుపుకోవాలని, భక్తులు ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు తీసుకురావద్దని వారు కోరారు. జాతర విజయవంతానికి అధికారులు, పోలీసులు, భక్తులు సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో జాతర నోడల్ అధికారి వీపీ గౌతమ్, పీవో చక్రధర్‌రావు, పౌర సంబంధాల శాఖ అధికారి డీఎస్ జగన్, ఈవో రాజేంద్రం, డీపీఆర్‌వో మహ్మద్‌గౌస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
*చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న కలెక్టర్ కర్ణన్, ఎస్పీ సంగ్రామ్ సింగ్