తెలంగాణ

మహా జాతరకు నేడు అంకురార్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్లగిరి యాదగిరి
మేడారం, ఫిబ్రవరి 4: తెలంగాణ మహా కుంభమేళాగా పిలుస్తున్న మేడా రం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు బుధవారం అంకురార్పణ జరుగనుంది. ఈ నెల 8వ తేదీ వరకు జాతర జరగనుంది. రెండేళ్లకోమారు జరిగే ఈ జాతరకు ఈ దఫా దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరువుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ములుగు జిల్లా మే డారంలో ఈ మహా జాతర జరుగనుం ది. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జా తరగా దీనికి ప్రత్యేక పేరుంది. తాడ్వా యి మండలంలోని కీకారణ్యం నుండి సాగే దారిలో మేడారం మాఘశుద్ధ పౌర్ణమి రోజు ప్రారంభమయ్యే ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రా ల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరుకానున్నారు. పూర్తిగా గిరిజన సంప్రదాయంగా జరిగే ఈ జాతరలో సమ్మక్క- సారలమ్మ అమ్మవార్లకు ఏ విధమైన విగ్రహాలు గానీ ప్రతిరూపాలు గానీ ఉండవు. ఈ జాతరకు వచ్చే భక్తులు పసుపు, కుంకుమ, బెల్లం (బంగారం) వంటి వస్తువులతోనే అమ్మవార్లకు మొ క్కులు చెల్లించడం ప్రత్యేకత. కనె్నపెల్లి నుండి సారలమ్మ, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజులు, పూ నుగొండ్ల నుంచి పగిడిద్దరాజు రాకతో జాతర
అధికారికంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే 50 లక్షలకు పైగా భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. సారలమ్మ ఆగమనంతో పాటు గురువారం 6న చిలకలగుట్ట నుండి సమ్మక్కతల్లి గద్దెలపైకి రావడంతో మహాజాతరలో భక్తులు మొక్కులు చెల్లించే ప్రక్రియ ఊపందుకుంటుంది. 5, 6 తేదీలలో తల్లీబిడ్డలిద్దరూ గద్దెలపైకి రావడంతో నిండుజాతర ఊపందుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నిలువెత్తు బంగారం, చీర, సారె, ఒడిబియ్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. సమ్మక్క-సారలమ్మ రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. జాతరకు ప్రభుత్వం 75 కోట్ల నిధులు విడుదల చేసింది. అదనపు స్నాన ఘట్టాలు, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య కార్యక్రమాలు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, భారీ బందోబస్తు, రవాణా సౌకర్యాలను ఇప్పటికే పూర్తి చేసింది. ఈనెల 7న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జాతరకు వస్తుండడంతో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమ్మవార్లకు మొక్కులు చెల్లించేందుకు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. కొందరు మహిళలు ప్రత్యేకంగా అమ్మవార్లు గద్దెలపై ఉన్న సమయంలోనే ఒడిబియ్యంతో వచ్చి అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. మేడారం మహా జాతరకు ముందు వన దేవతలను దర్శించుకున్న పౌర్ణమి వేళ గద్దెలపై తల్లీకూతురు ఉండగా మరోసారి భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జాతర సందర్భంగా ట్రాఫిక్ సమస్యతో పాటు క్యూలైన్లలో ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ములుగుజిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ కర్ణన్, నోడల్ అధికారి వీపీ గౌతమ్, ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్, ఎఎస్పీలు పోతరాజు సాయిచైతన్య, శరత్‌చంద్ర పవార్‌తో పాటు డీఎస్పీలు, సీఐలు పెద్ద ఎత్తున ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వీరితో పాటు వివిధ శాఖల అధికారులు ఆయా విభాగాల్లో సేవలందిస్తున్నారు. జాతరను విజయవంతం చేయాలనే కృతనిశ్చయంతో అధికార యంత్రాంగం ముందుకెళ్తోంది.

*చిత్రం...అమ్మవార్లకు మంగళవారం మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు