తెలంగాణ

బీజేపీ ఎంపీ బర్తరఫ్‌కు కాంగ్రెస్ నేత మల్లు రవి డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 4: జాతిపిత మహాత్మాగాంధీని దూషించిన బీజేపీ ఎంపీ హెగ్డేను పార్లమెంటు సభ్యునిగా బర్తరఫ్ చేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ మహాత్మాగాంధీ చేసిన గొప్ప స్వాతంత్య్ర పోరాటాన్ని అవమానపరిచారన్నారు. పైగా బ్రిటిష్ ప్రభుత్వంతో గాంధీ కుమ్మక్కైనట్లు ఆరోపణలు చేయడం దారుణమన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని మంటగలుపుతూ, ప్రజల మనోభావాలను దెబ్బతీసిన హెగ్డేపైన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఇటీవల బీజేపీ సభ్యులకు కాంగ్రెస్ పార్టీని, మహాత్మాగాంధీని అనుచితంగా విమర్శించడం ఫ్యాషన్‌గా మారిందన్నారు. ఇటువంటి చౌకబారు ప్రకటనలు చేయడం మానుకోవాలని ఆయన హితవుపలికారు. ప్రజలు బీజేపీని తీవ్రంగా ఏవగించుకుంటున్నారన్నారు. సత్యాగ్రహం, అహింస ద్వారా భారతదేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిన మహనీయుల పట్ల అమానవీయంగా మాట్లాడడం బీజేపీకే చెల్లుతుందన్నారు. ఒకవైపు గాంధీ సంకల్పయాత్రను బీజేపీ నిర్వహిస్తోందని, అదే సమయంలో ఈ తరహా కించపరిచే మాటలు మాట్లాడితే జనం నమ్మరన్నారు. బీజేపీ మతతత్వధోరణితో స్వాతంత్య్ర సమరపోరాటాన్ని చూస్తోందన్నారు. ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. బీజేపీ నేతలు ఇటీవల కాలంలో చౌకబారు మాటలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ నోరు పారేసుకుంటున్నారన్నారు.
జాతీయ రహదారుల అధికారులను కలిసిన ఎంపీ కోమటిరెడ్డి
జాతీయ రహదారుల అధికారులను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి రోడ్డు భద్రత, అభివృద్ధి పనులు, సోలార్ దీపాల ఏర్పాటు, లోహ రక్షక కంచెల నిర్మాణం, బస్‌బే, బస్ షెల్టర్ నిర్మాణం పలు అభివృద్ధి పనులను చర్చించారు. ఆలేరు జీడికల్ రోడ్డు వద్ద వీయూపీ, సర్వీసు రోడ్ల నిర్మాణం, ఎఫ్‌ఓబీ విత్ ఎస్కలేటర్‌పై చర్చించినట్లు ఆయన చెప్పారు. తాను ప్రతిపాదించిన అంశాలకు వారం రోజుల్లో అనుమతులు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.