తెలంగాణ

అసంబద్ధ ఆరోపణలు వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్ర అప్పులపై బీజేపీ, కాంగ్రెస్ నేతలవి అసంబద్ధ ఆరోపణలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఖండించారు. ఈ విషయంలో ఈ రెండు పార్టీలు అవగాహన లేకుండా మాట్లాడవద్దని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర అప్పులకు సంబంధించి లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ప్రతిని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. రాష్ట్ర అప్పుల స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో (జీఎస్‌పీడీపీ) 17 శాతంగా ఉన్నాయని కేంద్రం స్పష్టంగా పేర్కొందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు, ఆర్థిక భద్రత ప్రమాణాల మేరకే తెలంగాణకు అప్పులు ఉన్నాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
టర్మ్ అయిపోయిన లక్ష్మణ్ ఏ హోదాలో విమర్శిస్తారు: టీఆర్‌ఎస్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఏ హోదాలో విమర్శిస్తున్నారని టీఆర్‌ఎస్ ప్రశ్నించింది. రాష్ట్ర అధ్యక్షునిగా టర్మ్ ముగిసిన లక్ష్మణ్ ఏ హోదాలో ప్రెస్ మీట్లు పెడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ టి భానుప్రసాద్ విమర్శించారు. బీజేపీ నేతలకు గజినీ, ఘోరీలు తప్ప సామాన్య ప్రజలు గుర్తుకు రాదని, ప్రజల సంక్షేమం పట్టదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ నేతలు మతిలేకుండా మాట్లాడుతున్నారని భానుప్రసాద్ ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో భానుప్రసాద్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అప్పులపై కేటీఆర్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని లక్ష్మణ్ సవాల్ విసిరారని, ఆయనతో చర్చకు కేటీఆర్ అవసరం లేదని, తాను సరిపోతానని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరండం కాదా? అని ప్రశ్నించారు. బీజేపీకి రాష్ట్రంలో ఎంత బలం ఉందో హుజూర్‌నగర్, మున్సిపల్ ఎన్నికల్లోనే తేలిపోయిందన్నారు. గతంలో అమిత్ షా కూడా ఇలాగే అడ్డగోలుగా విమర్శిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ విసిరితే తోక ముడిచారని భానుప్రసాద్ గుర్తు చేశారు. డీపీఆర్ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు బ్యాంకులు రుణం ఎలా ఇస్తాయని ప్రశ్నించారు. మిషన్ భగీరథ పథకాన్ని స్వయంగా ప్రధాని మోదీ ప్రారంభించిన విషయాన్ని లక్ష్మణ్ మరిచిపోయారా? అని భానుప్రసాద్ మండిపడ్డారు.