తెలంగాణ

మేడారం భక్తుల మదిలో కేసీఆర్ నిలిచిపోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 4: మేడారం జాతరకు వచ్చే భక్తుల మదిలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్థిరంగా నిలిచిపోయేలా ఏర్పాట్లు ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ పిలుపు ఇచ్చారు. బూర్గుల రామకృష్ణారావు (బీఆర్‌కే) భవన్ నుండి మేడారం జాతర ఏర్పాట్లపై మంగళవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. జాతరలో వివిధ శాఖలు అందిస్తున్న సేవలు పూర్తిస్థాయిలో వినియోగంలో ఉండేలా చూడాలని సోమేశ్‌కుమార్ సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, మంచినీటి సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడాలని, టాయిలెట్ల వినియోగం పూర్తిగా జరిగేలా చూస్తూ, ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. రవాణాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆర్టీసి యంత్రాంగం చర్యలు తీసుకోవాలని, పార్కింగ్ లాట్స్ తదితర అంశాల్లో కూడా సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ శాఖలతో కూడిన ఇంటర్ సెక్టోరల్ టీమ్స్ ప్రతిరోజూ సమావేశమై తాజాపరిస్థితిపై సమీక్షించి, ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దాలన్నారు. టోల్‌గేట్ల వద్ద నోడల్ అధికారులను నియమించి రద్దీ ఏర్పడకుండా అదనపు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రహదారులపై మరమ్మత్తులకోసం కంటింజెన్సీ ప్రణాళికను రూపొందించుకుని, సిబ్బందిని ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి, ముఖ్యకార్యదర్శులు వికాస్‌రాజ్, రజత్‌కుమార్, సునీల్‌శర్మ, ఐజీ నాగిరెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, కలెక్టర్ కన్నన్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎస్ సోమేష్ కుమార్