తెలంగాణ

నైనీ, న్యూ పాత్రపాద గనులపై సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 4: ఒడిశాలో సింగరేణికి కేటాయించిన నైనీ బొగ్గు బ్లాకు నుండి వచ్చే మార్చికల్లా 50 లక్షల టన్నుల బొగ్గుతో ఉత్పత్తికి శ్రీకారం చుట్టాలని సింగరేణి కాలరీస్ కంపెనీ నిర్ణయించింది. ఒడిశా రాష్ట్రంలో సింగరేణికి కేటాయించిన నైనీ, న్యూ పాత్రపాద బొగ్గుగనులపై హైదరాబాద్‌లోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో మంగళవారం సీఎండీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థ సీఎండీ శ్రీ్ధర్ వివిధ ప్రాంతాలకు చెందిన జనరల్ మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి ప్రాంత గనులతో పాటర ఒడిశా రాష్ట్రంలో సింగరేణికి కేటాయించిన బొగ్గు బ్లాకులపై చర్చించారు. నైనీ బొగ్గు బ్లాకు నుండి వచ్చే ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి చేయడానికి కంపెనీ అధికారులు చేసిన కృషిని శ్రీ్ధర్ ప్రశంసించారు. గని ప్రారంభం కోసం చేపట్టాల్సిన కార్యచరణను ఆయన అధికారులకు వివరించారు. గనికి కావాల్సిన 783.27 హెక్టార్ల అటవీ భూములనుకు సంబంధించి సింగరేణి సంస్థ రూ.450 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో కేటాయింపుల కోసం అనుమతి తీసుకోనున్నట్లు వెల్లడించారు. 2021 మార్చి నాటికి నైనీ బొగ్గు బ్లాకు నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. బొగ్గు ఉత్పత్తిలో భాగంగా రైల్వే లైన్ కోసం జాయింట్ వెంచర్, న్యూ పాత్రపాదలో డ్రిల్లింగ్ వంటి పనులపై అధికారులకు సీఎండీ దిశ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సింగరేణి సంస్థలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
*చిత్రం... జీఎంలతో సమావేశమైన సీఎండీ శ్రీధర్