తెలంగాణ

బల్దియా కౌన్సిల్‌లో ‘పౌరసత్వ’ రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: మహానగరవాసులకు ముఖ్యమైన, అత్యవసరమైన సేవలను అందించే జీహెచ్‌ఎంసీ అభివృద్ధి పనులు, పరిపాలన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే కౌన్సిల్ సమావేశంలో ఈసారి ‘పౌర’ చట్టంపై రగడ చోటుచేసుకుంది. ఉదయం పదకొండు గంటలకు మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే, నగరంలో పౌరసేవల నిర్వహణపై ప్రసంగాన్ని ప్రారంభించిన మజ్లిస్ సభ్యుడు మాజీద్ హుస్సేన్‌తో పాటు ఇతర సభ్యులు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ చట్టం దేశ ప్రజాస్వామ్య విధానానికే వ్యతిరేకంగా ఉందని మజ్లిస్ సభ్యులు వ్యాఖ్యానించటాన్ని బీజేపీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ ఇతర సభ్యులు తప్పుబట్టారు. బడ్జెట్ కోసం ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందులో జాతీయ స్థాయి వ్యవహారాలను ప్రస్తావించటం ఏమిటీ? అని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో బీజేపీ, మజ్లిస్ సభ్యుల మధ్య వాదనలు తారస్థాయికి చేరటంతో ఎమ్మెల్సీ ఎం.ఎస్. ప్రభాకర్ జోక్యం చేసుకుని జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధిస్తున్న జరిమానాల విషయాన్ని ప్రస్తావించారు.
భారీ ఎత్తున విధిస్తున్న జరిమానాలను సామాన్యుడు భరించేలా లేడని మజ్లిస్ వాదించగా, ఇందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి జరిమానాలను నిర్ణయించాలని ఎంఎస్ ప్రభాకర్ సభకు సూచిస్తుండగా, మజ్లిస్ పార్టీకి చెందిన ఓ సభ్యుడు చేసిన వ్యాఖ్యకు ఎమ్మెల్సీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యుడు వెంటనే తన కామెంట్‌ను ఉపసంహరించుకోవాలని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేయగా, ఆయనకు టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు మద్దతు పలికి మజ్లిస్ సభ్యుల తీరును తప్పుబట్టారు. దీంతో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ జోక్యం చేసుకుని ప్రభాకర్‌కు నచ్చజెప్పారు. మధ్యాహ్నం బడ్జెట్ సమావేశం ముగిసిన తర్వాత సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది.
ఇందులో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పౌరసత్వం సవరణ చట్టాన్ని దేశంలో మొట్టమొదటి సారిగా వ్యతిరేకంగా సీఎం కేసీఆర్‌కు ధన్యవాధాలు తెలియజేస్తూ, కౌన్సిల్ కూడా తీర్మానం చేయాలని ప్రతిపాదించారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి దేశంలోనే మొట్టమొదటి స్థానిక సంస్థగా జీహెచ్‌ఎంసీ నిలవాలని మజ్లిస్ సభ్యుడు మాజీద్ హుస్సేన్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ ప్రభాకర్ కూడా మ ద్దతు పలకటంతో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించి సభను నిరవధికంగా వాయిదా వేశారు.
*చిత్రం... జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్