తెలంగాణ

ప్రశాంతంగా ముగిసిన మేడారం జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 8: ఆసియాలోనే గిరిజన జాతరైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర శనివారం విజయవంతంగా ముగిసింది. దీంతో పోలీసు అధికారులు ప్రశాంతంగా ఊపరి పీల్చుకున్నారు. గత జాతరల్లో జరిగిన ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకొని అమ్మవార్లను దర్శించుకునేందుకు తరలివచ్చే భక్తులకు పోలీస్ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందో అన్న భక్తుల అంచనాలకు తగ్గట్టుగానే జాతర విజయవంతంగా ముగియడంలో పోలీస్ యంత్రాంగం పాత్ర అభినందనీయం.
* కీలకంగా నిలిచిన పోలీస్ యంత్రాంగం
జాతర విజయవంతం చేయడంలో పోలీస్ బందోబస్తు కీలకంగా నిలిచింది. జాతర ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీస్ అధికారులు తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్ధాయిలో తమ సహకారాన్ని అందించారు. ఇందులో భాగంగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తూ ప్రణాళికలతో పోలీసులు తీసుకున్న చర్యలతో సామాన్య భక్తుడు నుండి వీవీఐపీ స్ధాయి భక్తుడి వరకు సకాలంలో అమ్మవార్లను దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకోవడంతో భక్తులు పోలీసుల విధుల పట్ల హర్షం వ్యక్తం చేశారు.
* నో ట్రాఫిక్ జాం
జాతర సమయంలో ఎదో సందర్భంలో, ఎదో ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ లాంటి సమస్యలు తలెత్తడం, వాహనాల్లో తరలివచ్చే భక్తులను ఇబ్బందులకు గురై పోలీసులపై భక్తులు అసహనాన్ని వ్యక్తం చేయడంతో పాటు ప్రసారమాధ్యామాల్లో పలనా ప్రాంతంలో ట్రాఫిక్ జామ్, రోడ్లపై బారులు తీరిన వాహనాలంటు స్క్రోలింగ్‌లు రావడంతో జాతరకు బయలుదేరేందుకు సిద్దమైన భక్తుల్లో మరింత ఆందోళనలు గురైయ్యే వారు. ఇలాంటి వాటికి పుల్‌స్టాప్ పేట్టేందుకు రాష్ట్ర పోలీస్ అధికారుల స్ధాయిలో సమావేశాలు నిర్వహించి జాతర సమయంలో ట్రాఫిక్ నియంత్రణకై అనుభవం ఉన్న పోలీస్ అధికారులను జాతర విధులు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.
* జాతరలో ట్రాఫిక్ నియంత్రణ కోసం
* తెర మీదకు వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్
గత మేడారం జాతర సమయంలో తలెత్తిన ట్రాఫిక్ జామ్ లాంటి సమస్యలు తెరమీదికి రావడంతో మేడారం జాతర సమయంలో ట్రాఫిక్ నియంత్రించేందుకుగాను గతంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ విభాగంలో పనిచేసి సక్సెస్ అయిన అధికారిగా గుర్తించబడిన వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్‌ను జాతరకు ట్రాఫిక్ జోన్‌కు ఇంచార్జీగా ఉన్న ఫలంగా ఆదేశాలు జారీ చేశారు.
మేడారం సమ్మక్క-సారలమ్మకు సేవలందించేందుకు తనకు దక్కిన సదావకాశంగా భావించిన వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ తనకు ఉన్న మార్క్‌తో జాతర బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులతో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులను సైతం పరుగులు పెట్టించారు. తన ప్రణాళికలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడారం జాతరలో జరిగే పలు పర్యాయాలను క్షేత్ర స్ధాయిలో సందర్శించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రాంతాలను గుర్తించి సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించడంతో పాటు జాతర సమయానికి పనులు పూర్తి చేయడం జరిగింది. దీంతో జాతర సమయంలో పోలీస్ కమిషనర్ రవీందర్ వ్యూహత్మకమైన ప్రణాళికను తీసుకోవడంతో వాహనాలను పార్కింగ్ స్థలాల్లోకి వాహనాలను క్రమపద్దతిలో తరలించేందుకు ఆయన అనుసరంచిన తీరు జాతర విజయవంతానికి మరింత కృషి చేసింది.
*చిత్రం... మేడారం జాతర ముగింపు రోజున భక్త జనం రద్దీ