తెలంగాణ

మెట్రో చార్జీలను తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: హైదరాబాద్ మెట్రో చార్జీలు తగ్గించాలని టీఎస్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంధ్రశేఖర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఎన్టీఆర్ ట్రస్ట భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేవంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్న మెట్రోరైలు చార్జీల కంటే హైదరాబాద్‌లో ఎక్కువగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.ఎల్‌అండ్‌టీ సంస్థతో జరిగిన ఒప్పందాల్లో భాగంగా గరిష్ట మెట్రో చార్జీలు 19గా ఉందన్నారు. అయితే ప్రస్తుతం మెట్రోచార్జీ రూ.60 ఉందన్నారు. ఖచ్చితంగా మెట్రో చార్జీ 40కి దాటకూడదని ఫెయిర్ నోటిఫికేషన్‌లో ఉందన్నారు. ఎడాపెడా మెట్రో చార్జీలు వసూళ్లు చేయడం నిబంధనలకు విరుద్దమన్నారు. అన్‌లిమిటీడ్‌గా తిరిగినా రూ.40కి మించకూడదన్నారు. బెంగళూరు, ఢిల్లీ మెక్రో చార్జీలను పోలిస్తే హైదరాబాద్ మెట్రో చార్జీలు ఎక్కవన్నారు. బెంగళూరులో 6కిమీలకు మెట్రో చార్జీ రూ.18 ఉంటే, హైదరాబాద్‌లో రూ.25 ఉందన్నారు. హైదరాబాద్‌లో మెట్రో చార్జీలకు పొంతన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేక్‌హోల్డర్స్‌ను ఎవరినీ సంప్రదించకుండా కొత్త చార్జీలను ఎల్ అండ్ టీ ఇచ్చిన ప్రెస్ రిలీజ్‌కు అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.