తెలంగాణ

సింగరేణి సీఎండీకి భారతీయ మహంతం పురస్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: గత ఐదేళ్లలో సింగరేణి సంస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమ్మకాలు, లాభాల్లో అత్యధిక వృద్ధి రేటును సాధించడానికి కృషి చేసిన సంస్థ సీఎండీ శ్రీ్ధర్ అవార్డుల పంట పండింది. ప్రముఖ ఏషియా వన్ మ్యాగ్‌జైన్ ఆధ్వర్యంలో బ్యాంకాక్ (్థయ్‌లాండ్)లో జరిగిన కార్యక్రమంలో శ్రీ్ధర్ భారతీయ మహంతం పురస్కార్ అవార్డు అందుకున్నారు. ఈనెల 7వ తేదీన 13వ ఏషియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరం సదస్సులో మొరాకో, మాల్దీవ్స్ దేశ రాయబారుల నుంచి శ్రీ్ధర్ అవార్డు స్వీకరించారు. ఆసియా దేశాల్లో వ్యాపార, వాణిజ్య పరిశ్రమల విభాగాల్లో అత్యంత ప్రతిభావంతులైన సీఈఓలకు ఇచ్చే ఈ అవార్డు ఈసారి సింగరేణి సీఎండీ శ్రీ్ధర్‌కు దక్కింది. గత ఐదేళ్లలో సింగరేణిలో అమ్మకాల్లో 78 శాతం వృద్ధి, లాభాల్లో 262 శాతం వృద్ధి సాధించిందని సంస్థ ప్రకటించింది. సీఎండీ శ్రీ్ధర్‌కు ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కడం పట్ల సంస్థ సింగరేణి బోర్డు డైరెక్టర్లతో పాటు ఏరియా మేనేజర్లు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.