తెలంగాణ

ఈ-గవర్నెన్ సలో తెలంగాణకు ఉత్తమ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: తెలంగాణ బ్లాక్ చైన్ ప్రాజెక్టు టీ చిట్స్ ఈ- గవర్నెన్స్ విభాగానికి కొత్త టెక్నాలజీని అందించి విజయవంతంగా అమలు చేస్తున్నందుకు ఉత్తమ్ గోల్డ్ అవార్డుకు ఎంపికైంది. ముంబయిలో శనివారం జరిగిన 23వ నేషనల్ కాన్ఫరెన్స్ ఈ-గవర్నెన్స్‌లో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును కేంద్రమంత్రి చేతుల మీదుగా ఐటీ శాఖ అధికారులు అందుకున్నారు. ఈ అవార్డు తెలంగాణ రాష్ట్రానికి లభించడం పట్ల ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ స్వాగతించారు. టీ చిట్స్ విభాగంలో ఆర్థిక లావాదేవీలకు చెక్కుచెదరని భద్రతను కల్పించడంలో తెలంగాణ బ్లాక్ చైన్ ముందంజలో ఉందని ఆయనన చెప్పారు. చిట్‌ఫండ్ బిజినెస్‌లో రాష్ట్రంలో ఉన్న సంస్థలకు నమ్మకమైన సేవలను అందిస్తున్నట్లు ఐటీ శాఖ ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి లంకా చెప్పారు.

*చిత్రం... కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ చేతుల మీదుగా అవార్డును అందుకుంటున్న రాష్ట్ర ఐటీ శాఖ డైరెక్టర్ రమాదేవి