తెలంగాణ

తొలి దశలో 55..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ న్యాయాలయాల వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలిదశలో భాగంగా 33 జిల్లాల్లో 55 గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయనుంది. గ్రామన్యాయాలయాల చట్టం 2008లో వచ్చింది. సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు ఈ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ చట్టం అమలులో ఉంది. రాష్ట్రప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఉమ్మడి కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో 55 గ్రామ పంచాయతీల్లో గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ శివార్లలో కీసర, పేట్‌బషీరాబాద్, శామీర్‌పేట్, కుత్బుల్లాపూర్‌లో గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేస్తారు. పార్లమెంటు చట్టానికి అనుగుణంగా ఏర్పాటు చేయనున్న గ్రామ న్యాయాలయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైకోర్టు ఆదేశాలకు లోబడి గ్రామ న్యాయాధికారిని నియమిస్తారు. ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణులై ఉండి 45 సంవత్సరాల వయస్సు దాటని వారిని గ్రామ న్యాయాధికారులుగా నియమిస్తారు. గ్రామ న్యాయాధికారికి రూ.27,700-44,770 వేతనం, హెడ్ క్లర్క్‌కు రూ.22,290, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టుకు రూ.15,000, స్టెనోగ్రాఫర్‌కు రూ.15,000, ఆఫీసు సబార్డినేట్ (అటెండర్)కు రూ.12,000 వేతనం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవోఎంఎస్ 4ను న్యాయ శాఖ జారీ చేసింది. దిగువ స్థాయిలో ప్రజల గుమ్మం వద్దనే న్యాయాన్ని అందించాలనే సంకల్పంతో న్యాయాలయాలను ఏర్పాటు చేస్తారు. ఫస్ట్‌క్లాస్
జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌కు ఉండే అధికారాలు న్యాయాధికారులకు ఉంటాయి. వీరికి భౌగోళిక పరిధిని కూడా నిర్దేశిస్తారు. సివిల్, క్రిమినల్ కేసుల వివరాలను హైకోర్టు నోటిఫై చేస్తుంది. ఈ ఆదేశాలకు అనుగుణంగా గ్రామ న్యాయాలయాలు పనిచేస్తాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎక్స్‌ఎక్స్‌ఐ చాప్టర్‌లోని నిబంధనలకు అనుగుణంగా న్యాయాలయాలు పనిచేస్తాయి. దావా దాఖలు చేసినప్పటి నుంచి ఆరునెలల్లోగా సివిల్ కేసులను పరిష్కరించాల్సి ఉంటుంది. మొదటి విచారణలోనే దావాలోని పార్టీలు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది.