తెలంగాణ

లక్షన్నర కిలోమీటర్లలో ఇంటర్నెట్ ఫైబర్ లైన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: మారుమూల ప్రాంతాల్లో సైతం ఇంటింటికి ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించే విధంగా, తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుతో ప్రతి ఒక్కరికీ అన్ని అవకాశాలు అందాలన్న లక్ష్యంతో లక్షా 50వేల కిలో మీటర్ల మేర ఇంటర్‌నెట్ ఫైబర్ లైన్లు వేస్తున్నట్టు మంత్రి తారక రామారావు తెలిపారు. మారుమూల గ్రామాలను ప్రపంచంతో కలపాలని, ఇది ఇంటర్‌నెట్‌తోనే సాధ్యం అవుతుందని అన్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపైన ఐటి శాఖ నిర్వహించిన వర్క్‌షాప్‌లో కెటిఆర్ మాట్లాడారు. దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్న డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ లాంటి నినాదాలు ఈ ఫైబర్ గ్రిడ్ ద్వారా సాధ్యం అవుతాయని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వ సేవలు మరింత వేగంగా ఇవ్వగలుతామని చెప్పారు.