తెలంగాణ

దీన్‌దయాళ్ ఆదర్శాలే దేశానికి మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ అధ్యక్షుడు , బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దీయాళ్ ఉపాధ్యాయ ఆదర్శాలే దేశానికి మార్గమని మాజీ గవర్నర్, బీజేపీ నేత సీహెచ్ విద్యాసాగరరావు పేర్కొన్నారు. మంగళవారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన దీన్ దయాళ్ వర్థంతి కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకాత్మత మానవతావాదమే లక్ష్యంగా దీన్ దయాళ్ ముందుకు సాగారని, అదే బీజేపీకి మార్గం అయిందని అన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తి సైతం జీవితంలో సుఖంగా ఉండాలని కోరుకునే వారని, అతనికి సైతం ప్రభుత్వ ఫలాలు అందాలని అనేవారని ఆధ్యాత్మిక దృష్టితో మానవ సేవ చేయడమే సరైన జీవిత విధానమని ఆయన వాదించేవారని పేర్కొన్నారు. విశ్వమానవాళిని దృష్టిలో పెట్టుకుని ఏకత్మతా మానవతావాద సిద్ధాంతాన్ని బీజేపీ ఆచరణలో చూపుతోందని అన్నారు. వ్యక్తి శీలం గొప్పదని, సమాజ శీలం ఇంకా గొప్పదని అన్నారు.
ఢిల్లీలో మెరుగైన ఫలితాలు
ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలనే సాధించిందని, గత సారి అసెంబ్లీలో ఉన్న సీట్ల కంటే ఈసారి సీట్ల సంఖ్య పెరిగిందని ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు పేర్కొన్నారు. బీజేపీపై ఢిల్లీ ప్రజల నమ్మకం పెరిగిందని అన్నారు.
*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న సీహెచ్ విద్యాసాగరరావు