తెలంగాణ

సేఫ్టీ క్లబ్‌లతో మహిళలకు భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణలో మహిళలు, యువతుల భద్రత, రక్షణ కోసం చేపట్టిన చర్యలు వినూత్నంగా ఉన్నాయని.. దీంతో మహిళల్లో భరోసా ఏర్పడిందని ప్రశంసించారు. తాజాగా మహిళల భద్రత కోసం సేఫ్టీ క్లబ్‌లను తీసుకురావడం సంతోషకరమన్నారు. సికింద్రాబాద్ ఎస్‌వీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ అండ్రు ఫ్లెమింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి సేఫ్టీ క్లబ్‌లను ప్రారంభించారు. ఈ సేఫ్టీ క్లబ్‌లను కేవలం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. మహిళల భద్రతపై ప్రవేశపెట్టిన హాక్ ఐ, డయల్ 100, షీ టీమ్స్, సేఫ్టీ క్లబ్ తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. మహిళా భద్రతా విభాగం రాష్ట్ర ఐజీ స్వాతి లక్రా, ఎస్పీ బీ.సుమతి మాట్లాడుతూ సమాజంలో కేవలం పది నుండి పదిహేను శాతం యువకుల ప్రవర్తనలోనే మార్పు తేవాల్సిన అవసరం ఉందన్నారు. దాదాపు 80 శాతానికి పైగా యువకులు సత్ప్రవర్తనతో వున్నారని అభిప్రాయపడ్డారు. ప్రతి కాలేజీలో 45 మంది విద్యార్థినులు సభ్యులుగా ఈ సేఫ్టీ క్లబ్‌లుంటాయనీ.. వీరు తోటి విద్యార్థినుల భద్రతతో పాటు, తమ చుట్టూ ఉన్న మహిళల రక్షణ కోసం పనిచేస్తారని తెలిపారు. సేఫ్టీ క్లబ్‌లను త్వరలోనే రాష్ట్రం అంతటికీ విస్తరిస్తామని పేర్కొన్నారు. షీ టీమ్స్, విమెన్ సేఫ్టీ వింగ్‌లు ఎప్పుడూ మహిళల భద్రతే ప్రధాన ద్యేయంగా పనిచేస్తాయని స్వాతిలక్రా స్పష్టం చేశారు. ప్రతి మహిళా, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి విద్యార్థినీ విధిగా హాక్-ఐ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాలేజీలకు చెందిన విద్యార్థినులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, రక్షణపై రూపొందించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆలోచింపజేశాయి. కార్యక్రమంలో ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ టీ.శేషుకుమారి, కాలేజీ విద్య జాయింట్ డైరెక్టర్ మంగళ, పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన అజయ్ సింగ్, వికార్ ఘావ, మధుసూదన్ రావు, సబ్రియా తదితరులు హజారయ్యారు.
*చిత్రం... జ్యోతి ప్రజ్వల చేసి సేఫ్టీ క్లబ్‌లను ప్రారంభిస్తున్న బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రు ఫ్లెమింగ్