తెలంగాణ

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ ఒలింపిక్ సంఘం (టీఓఏ) అధ్యక్షుడు జయేష్ రంజన్ తెలిపారు. టీఓఏ అధ్యక్షునిగా ఎన్నికైన జయేష్ రంజన్‌ను తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ టీఓఏ ఎన్నికల్లో తన నాయకత్వాన్ని బలపరిచి గెలిపించిన ప్రతి క్రీడా సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదగడానికి ప్రభుత్వంతో పాటు క్రీడా సంఘాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఆయా క్రీడలకు సంబంధించి మేటి క్రీడాకారులను గుర్తించి వారిక సరైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని క్రీడా సంఘాల ప్రతినిధులతో సమావేశమై క్రీడల అభివృద్ధికి తీసుకోవాల్సిన కార్యచరణపై రూపకల్పన చేస్తామన్నారు.
క్రీడల అభివృద్ధికి కవాల్సిన వసతులను, స్టేడియంల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందన్నారు.