తెలంగాణ

ఫార్మాసిటీ అనుమతుల రద్దుకు ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ముచ్చర్లలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి అనుమతులు రద్దు చేయాలని ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాశారు. ఫార్మా పరిశ్రమల వల్ల పర్యావరణం, నీరు, భూమి, వాతావరణం కాలుష్యమవుతాయన్నారు. ఫార్మా సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తున్న భూమి వ్యవసాయానికి యోగ్యంగా ఉండే మంచి భూములని చెప్పారు. ఫార్మా సిటీతో కాలుష్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు. దశాబ్థాలుగా హైదరాబాద్ నగరం పారిశ్రామిక కాలుష్యంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతోందన్నారు. ఫార్మా సిటీ భూ అక్రమాలపై విచారణ జరిపించాలన్నారు. వేల ఎకరాలను భూ దందా చేస్తున్నారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఫార్మా సిటీని నెలకొల్పుతున్నారన్నారు. పేదరైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారన్నారు. రూ.8 లక్షలకు ఎకరం చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసి ఫార్మా కంపెనీలకు రూ.1.5 కోట్ల చొప్పున విక్రయిస్తున్నారన్నారు. 19వేల ఎకరాలు ఫార్మా సిటీకి అవసరం లేదన్నారు. చెరువులు, భూగర్భ జలాలు కాలుష్యమయమవుతాయన్నారు. ప్రకృతి సర్వనాశనం అయితే అణగారిన వర్గాలకు తీవ్రనష్టం జరుగుతుందన్నారు. తక్షణమే ఫార్మా సిటీని అడ్డుకోవాలన్నారు. భూ దందా మీద సమగ్ర విచారణ చేయాలన్నారు.