తెలంగాణ

కంపెనీలొస్తున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణలో తమ పరిశ్రమలను స్థాపించడానికి, పెట్టుబడులు పెట్టడానికి మరికొన్న కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పరిశ్రమలకు మరిం త ఊతం ఇచ్చేలా పని చేస్తున్నామన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో బుధవారం పరిశ్రమలు, ఐటీ శాఖల అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభు త్వ విధానాల వల్ల అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. కొత్తగా వచ్చే కంపెనీలకు అవసరమైన వౌలిక వసతులకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని బుగ్గపాడు, బండమైలారం, బండ తిమ్మాపూర్ తదితర ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్న కంపెనీల వివరాలను మంత్రికి అధికారులు వివరించారు. త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌లు ఈ మేరకు ప్రకటనలు చేయనున్నాయని చెప్పా రు. అలాగే, వరంగల్‌లోని టెక్స్‌టైల్ పార్క్ పట్ల పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయన్నారు. మరిన్ని కంపెనీలు రానుండటంతో వాటికి అవసరమైన వౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిందిగా టీఎస్‌ఐఐసీ అధికారులను ఆదేశించారు. వివిధ విభాగా ల్లో టీఎస్‌ఐఐసీ సిద్ధం చేసిన ఇండస్ట్రియల్ పార్క్ లు, వౌలిక వసతుల వివరాలను మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. టీ-హబ్ రెండో దశ త్వరలోనే పూర్తి అవుతుందని అన్నారు. ఇది అతి పెద్ద ఇంక్యూబేటర్ కాబోతుందని మంత్రి అన్నారు. దీనితో పాటు జూలైలో ప్రోటో టైపింగ్ సెంటర్ ఏర్పాటు కానుందన్నారు. ఐటీ పరిశ్రమలన్నీ హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నామన్నారు. వీటికి అవసరమైన మేరకు పార్క్‌ల అభివృద్ధి, కనె్వన్షన్ సెంటర్ల ఏర్పాట్లపై దృష్టి సారించినట్టు మంత్రి వివరించారు. ఇప్పటికే వరంగల్‌లో ప్రముఖ ఐటీ కంపెనీలు తమ కార్యాకలాపాలు విస్తరణకు చర్యలు తీసుకుంటున్నాయని అన్నా రు. అలాగే, ఈనెల 18న కరీంనగర్‌లో ఐటీ టవర్‌ను ప్రారంభించనున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖ మ్మం పట్టణాల్లో ఐటీ భవనాల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నట్టు అధికారులు వివరించారు. ఈ భవనాల్లో కార్యకలాపాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన కంపెనీలతో ముందుగానే మా ట్లాడి జాప్యం లేకుండా వారి యూనిట్లను నెలకొల్పడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ కమిషనర్ మానిక్‌రాజ్, టెక్స్‌టైల్స్ డైరెక్టర్ శైలజా రామయ్యార్, టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.

*చిత్రం...సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్